New study : గర్భనిరోధక మాత్రలతో నష్టాలే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి..
సాక్షి లైఫ్ : గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల నష్టాలే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయని అమెరికాకు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ సూద్ వెల్లడించారు. అయితే, ఈ మాత్రల వల్ల నష్టమే కాదు.. కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని, ఈ పిల్స్ కొన్నిరకాల క్యాన్సర్ల నుంచి మహిళలకు శక్తివంతమైన, దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తాయని ఆయన చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..@ 7 ఏళ్లు : ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్'..
ఇది కూడా చదవండి..Sciatica : సయాటికా, నడుము నొప్పి ఉపశమనం కోసం ఉత్తమ యోగాసనాలు..
ఇది కూడా చదవండి..Hypertension : చెవుల్లో 'రింగుమనే' శబ్దం హైపర్‌టెన్షన్‌కు హెచ్చరిక సంకేతమా..?
అండాశయ క్యాన్సర్.. గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30శాతం నుంచి 50శాతం వరకు తగ్గుతుంది. ఈ పిల్స్ వాడడం ఆపేసిన తర్వాత కూడా దశాబ్దాల పాటు ఆయా మందుల పవర్ కొనసాగుతుందని ఆయన అంటున్నారు. గర్భసంచి క్యాన్సర్ ప్రమాదం కూడా 30శాతం వరకు తగ్గుతుంది. పెద్ద పేగు క్యాన్సర్.. సుమారు 20శాతం వరకు ప్రమాదం తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
గర్భనిరోధక మాత్రలు అనేవి ఒక రెండు వైపులా పదునున్న కత్తి వంటివి. వీటిని కేవలం గర్భ నిరోధకానికే కాకుండా, PCOS, ఎండోమెట్రియోసిస్, అధిక రక్తస్రావం వంటి ఆరోగ్య సమస్యల చికిత్సకు కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారని డాక్టర్ సూద్ అభిప్రాయపడ్డారు.
క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉన్న యువతులలో, గర్భనిరోధక మాత్రల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఏ రకమైన గర్భనిరోధక పద్ధతిని ఎంచుకోవాలన్నా, దాని లాభనష్టాలు, వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను, ముఖ్యంగా కుటుంబంలో క్యాన్సర్ చరిత్రను పరిగణనలోకి తీసుకుని వైద్యుడి సలహా తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి
