New Study : పీరియడ్స్ సైకిల్ గ్యాప్ ఉన్నవారికి హార్ట్ ఎటాక్ ముప్పు..
సాక్షి లైఫ్ : సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులు కేవలం పురుషులకు మాత్రమే వస్తాయని లేదా వృద్ధాప్యంలో వచ్చే సమస్యలుగా చాలామంది భావిస్తుంటారు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. మహిళల్లో అన్ని రకాల క్యాన్సర్ల వల్ల జరిగే మరణాల కంటే, గుండె జబ్బుల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేపట్టిన పదేళ్ల సుదీర్ఘ అధ్యయనంలో.. సగం కంటే తక్కువ మంది మహిళలు మాత్రమే గుండె జబ్బులను తమకు ప్రాణాంతకమైనవిగా గుర్తించగలుగుతున్నారని తేలింది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ప్రత్యుత్పత్తి ఆరోగ్యం.. గుండెకు సంకేతం..!
మహిళల ప్రత్యుత్పత్తి ఆరోగ్య చరిత్రను బట్టి వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జేన్ మోర్గాన్ పేర్కొంటున్నారు. మీ ఆరోగ్య చరిత్రలో ఈ క్రింది అంశాలు ఉంటే గుండె జబ్బుల పట్ల అప్రమత్తంగా ఉండాలి:
నెలసరి చక్రం.. పీరియడ్స్ సైకిల్ 22 రోజుల కంటే తక్కువ లేదా 34 రోజుల కంటే ఎక్కువ ఉన్నవారికి హార్ట్ ఎటాక్, ఎట్రియల్ ఫిబ్రిలేషన్ వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. గర్భధారణ సమస్యలు.. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం (Gestational Diabetes), ప్రీ-ఎక్లాంప్సియా (బి.పి పెరగడం) వంటి సమస్యలు భవిష్యత్తులో గుండె సమస్యలకు దారితీస్తాయి.
ముందస్తు మెనోపాజ్.. 40 ఏళ్ల కంటే ముందే సహజంగా లేదా శస్త్రచికిత్స ద్వారా మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ముప్పు ఎక్కువగా ఉంటుంది. అధిక వేడి (Hot Flashes).. మెనోపాజ్ సమయంలో రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, ఒళ్లు వేడెక్కడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వారికి పక్షవాతం లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
మరింత ఖచ్చితంగా అంచనా వేయవచ్చు..
వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు మీ డాక్టర్ మీ గైనకాలజీ చరిత్ర గురించి అడగకపోతే, మీరే స్వయంగా ఆ విషయాలను వివరించాలి. దీనివల్ల మీ గుండె ఆరోగ్య స్థితిని వారు మరింత ఖచ్చితంగా అంచనా వేయగలరు.
ఆరోగ్య సూత్రాలు..
పండ్లు, ఆకుకూరలు,ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని దరిచేరనీయకుండా చూసుకోవాలి. గుండె ఆరోగ్యం అనేది వయస్సుతో సంబంధం లేని విషయం. కాబట్టి చిన్న వయస్సు నుంచే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
