Beautiful Skin : అందమైన చర్మానికి అసలైన రహస్యం..'pH' సమతుల్యత..! ఎంత ఉంటే మంచిది..?
సాక్షి లైఫ్ : బాహ్య సౌందర్యంలో చర్మ సంరక్షణ అత్యంత కీలకమైనది. మెరిసే, మచ్చలేని చర్మం కోసం మనం ఎన్నో రకాల క్రీములు, లోషన్లు వాడుతుంటాం. అయితే, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం వాడే సౌందర్య ఉత్పత్తులు సరిగ్గా పనిచేయాలన్నా చర్మంలో 'pH' (పొటెన్షియల్ హైడ్రోజన్) స్థాయి సమతుల్యంగా ఉండటం ఎంతో అవసరమని చర్మ రోగ నిపుణులు (Dermatologists) చెబుతున్నారు. అనాదిగా జరుగుతున్న పరిశోధనలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అసలు ఈ pH అంటే ఏమిటి? చర్మంపై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
చర్మ pH అంటే ఏమిటి..?
pH అంటే 'పొటెన్షియల్ హైడ్రోజన్'. మన చర్మం ఎంత ఆమ్లగుణాన్ని (Acidic) లేదా క్షారగుణాన్ని (Alkaline) కలిగి ఉందో తెలిపే కొలమానమే ఇది. దీనిని 0 నుండి 14 పాయింట్ల స్కేల్‌పై కొలుస్తారు.
7 pH: దీనిని తటస్థ (Neutral) స్థాయి అంటారు.
7 కంటే తక్కువ: ఆమ్ల తత్వాన్ని (Acidic) సూచిస్తుంది.
7 కంటే ఎక్కువ: క్షార తత్వాన్ని (Alkaline) సూచిస్తుంది.
సాధారణంగా ఆరోగ్యకరమైన వయోజనుల చర్మం కొద్దిగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి, 4.7 నుండి 5.5 pH మధ్య ఉంటుంది. ఈ ఆమ్ల పొర (Acid Mantle) చర్మాన్ని హానికర బ్యాక్టీరియా, కాలుష్యం నుండి రక్షించే కవచంలా పనిచేస్తుంది.
pH సమతుల్యత దెబ్బతినడానికి కారణాలు..
మన రోజువారీ అలవాట్లే చర్మ pH హెచ్చుతగ్గులకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా మన ఆహార నియమాలు..
మితిమీరిన కెమికల్స్ ఉన్న సౌందర్య ఉత్పత్తులు, సబ్బులు వాడటం.
సరైన పరిశుభ్రత పాటించకపోవడం లేదా ముఖాన్ని అతిగా కడగడం.
మీ చర్మ pH ఎంత ఉందో ఇలా తెలుసుకోండి..
సహజ పద్ధతిలో ఇంట్లోనే చర్మ pH స్థాయిని అంచనా వేయవచ్చు. దీనికోసం ఒక pH టెస్టింగ్ స్ట్రిప్, శుద్ధి చేసిన నీరు అవసరమవుతాయి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, ఎలాంటి క్రీములు రాయకుండా 30 నిమిషాల పాటు వదిలేయాలి. ఇప్పుడు pH స్ట్రిప్‌ను డిస్టిల్డ్ వాటర్‌తో కొద్దిగా తడిపి, ముఖంపై వివిధ భాగాల్లో కొన్ని సెకన్ల పాటు ఉంచాలి. స్ట్రిప్ మారిన రంగును, కిట్‌తో పాటు వచ్చే కలర్ చార్ట్‌తో పోల్చి చూడాలి. 4.7 - 5.5 మధ్య వస్తే మీ చర్మం సంపూర్ణ ఆరోగ్యంగా, సమతుల్యంగా ఉన్నట్లు అర్థం. 6 కంటే ఎక్కువ వస్తే చర్మం పొడిబారే గుణాన్ని (Alkaline) కలిగి ఉందని అర్థం. 4.5 కంటే తక్కువ వస్తే చర్మంలో ఆమ్లత్వం (Acidic) ఎక్కువగా ఉందని గ్రహించాలి.
సమతుల్యత లోపిస్తే కనిపించే లక్షణాలు..
చర్మంలో pH స్థాయిలు మారినప్పుడు మనకు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి:
చర్మం విపరీతంగా పొడిబారడం లేదా పొట్టులా రాలడం.
ముఖం కడుక్కున్న ప్రతిసారీ చర్మం బిగుతుగా, గుంజేసినట్లు అనిపించడం.
చర్మం సున్నితంగా మారి ఎర్రబడటం, దురద రావడం.
జిడ్డు గ్రంథులు ఉత్తేజితమై అతిగా నూనెలు ఊరడం, తద్వారా మొటిమలు రావడం.
pHని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు..
సరైన మాయిశ్చరైజర్: మీది జిడ్డు చర్మం అయినప్పటికీ, చర్మానికి తగినంత తేమను అందించే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్‌ను తప్పనిసరిగా వాడాలి. గాఢమైన రసాయనాలు, సువాసనలు లేని.. తక్కువ pH (Mild/Balanced) కలిగిన ఫేస్ వాష్‌లను ఎంచుకోవాలి.
వారానికి ఒకటి లేదా రెండుసార్లు చర్మాన్ని సున్నితంగా మృతకణాల తొలగింపు చేయడం వల్ల pH సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. సూర్యరశ్మిలోని హానికర కిరణాల వల్ల చర్మ రక్షణ పొర దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా సన్‌స్క్రీన్ లోషన్ రాయడం మరువకండి. చర్మంపై ఎలాంటి కొత్త ప్రయోగాలు చేసినా, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఒకసారి చర్మ సంరక్షణ నిపుణులను (Dermatologist) సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
