Vitamin B12 Deficiency : మహిళల్లో విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : శరీరంలోని అన్ని పోషకాలు తగినంత మొత్తంలో ఉంటేనే హెల్తీగా ఉండడానికి వీలుంటుంది. అంతేకాదు ఇవి ఆరోగ్యంగా ఉంచడమేకాకుండా శారీరిక శక్తికి చాలా అవసరం. మహిళలు ఇంటిపని, ఆఫిస్ పనిలో పడిపోయి సరైన పోషకాహారం తీసుకోలేకపోవడం వల్ల పోషక లోపాలకు దారితీయడమేకాకుండా అనారోగ్య సమస్యల బారీన పడాల్సి వస్తోంది.
ముఖ్యమైన విటమిన్స్ లో ప్రధాన మైంది విటమిన్ బి12. ఈ విటమిన్ లోపం సాధారణంగా శాఖాహార ఆహారం తినే మహిళల్లోనే ఎక్కువగా తలెత్తుతుంది. విటమిన్ బి12 లోపం మహిళల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అయితే, విటమిన్ బి12లోపించినప్పుడు ఆయా లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే, దానిని పరిష్కరించవచ్చు. మహిళల్లో విటమిన్ బి12 లోపం సంకేతాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
విటమిన్ బి12 లోపం తలెత్తినప్పుడు కనిపించే సంకేతాలు..
అలసట, బలహీనత - తగినంత నిద్ర తర్వాత కూడా బాగా అలసిపోయి బలహీనంగా అనిపిస్తే, ఇది విటమిన్ బి12 లోపానికి సంకేతం కావచ్చు. విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల తయారీలో సహాయ పడుతుంది. ఒకవేళ ఈ విటమిన్ లోపిస్తే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు, తద్వారా అలసట, బలహీనతగా అనిపిస్తుంది.
మరింతగా పెరిగే ప్రమాదం..
మైకం, శ్వాస ఆడకపోవడం.. విటమిన్ బి12 లోపం రక్తహీనతకు దారితీస్తుంది. తేలికపాటి బరువులు ఎత్తినా, మెట్లు ఎక్కినా కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అప్పుడప్పుడు తలతిరగడానికి కారణమవుతుంది. చేతులు,కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి.. వంటి లక్షణాలను మహిళలు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల సమస్య మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన నరాలను నిర్వహించడానికి విటమిన్ బి12 అవసరం. ఈ విటమిన్ లోపం నరాల నష్టానికి కారణమవుతుంది, అంతేకాదు చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి లేదా మంటగా ఉంటుంది.
మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు, నిరాశ.. విటమిన్ B12 మెదడులోని సెరోటోనిన్ స్థాయిలతో నేరుగా ముడిపడి ఉంటుంది. దీని లోపం కారణంగా మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు, చిరాకు, నిరాశ లక్షణాలకు కారణమవుతుంది.
ముఖం పాలిపోవడం..
జ్ఞాపకశక్తి కోల్పోవడం.. మీరు చిన్న విషయాలను త్వరగా మర్చిపోతుంటే, ఇది విటమిన్ B12 లోపం సంకేతం. ఇది మెదడు కణాలు, న్యూరాన్‌లను ప్రభావితం చేస్తుంది, జ్ఞాపకశక్తి కోల్పోవడానికి దారితీస్తుంది. ముఖం పాలిపోవడం, కాంతి లేకపోవడం.. విటమిన్ B12 లోపం రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం,ముఖం పాలిపోయినట్లు లేదా నీరసంగా కనిపిస్తుంది. తద్వారా సహజ కాంతి తగ్గుతుంది.
నోటిలో మంట.. విటమిన్ B12 లోపం వల్ల వాపు, ఎరుపు, మంట ,నాలుకపై తరచుగా నోటిలో పుండ్లు వస్తాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాహారం అందడం లేదని సూచిస్తుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించనప్పుడు, గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా, గుండె వేగంగా కొట్టుకోవడం లేదా దడగా అనిపించడం వంటి సంకేతాలు కూడా విటమిన్ B12 లోపం కారణంగానే కనిపిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
