Liver Problems : మహిళల్లోనే లివర్ సమస్యలు ఎందుకు ఎక్కువ అంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవితం, మారిన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలు ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్నాయి. అయితే, కాలేయ వ్యాధులు పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎందుకు భిన్నంగా ఉంటున్నాయి? కొందరిలో వ్యాధి తీవ్రత ఎందుకు ఎక్కువగా ఉంటోంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా తాజా పరిశోధన ఒకటి కీలక విషయాలను వెల్లడించింది. కాలేయంలో ఉండే 'GPR110' అనే ప్రత్యేక రిసెప్టర్ మహిళల్లో కాలేయ వ్యాధి ముప్పును పెంచుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

ముదిరితే 'మ్యాష్' ప్రమాదమే..!

సాధారణంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఇది ముదిరితే 'మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటో హెపటైటిస్' (MASH) గా మారుతుంది. దీనివల్ల కాలేయంలో వాపు, ఫైబ్రోసిస్ ఏర్పడి చివరికి అది లివర్ ఫెయిల్యూర్ లేదా క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అయితే ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో వేగంగా ముదిరే అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.

పరిశోధనలో తేలిందేమిటి..?

శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో GPR110 రిసెప్టర్ పాత్రను క్షుణ్ణంగా పరిశీలించారు. కాలేయ కణాల్లోని GPR110 రిసెప్టర్‌ను తొలగించినప్పుడు, ఆడ ఎలుకల్లో కాలేయ వాపు, ఫైబ్రోసిస్ గణనీయంగా తగ్గాయి. మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ కాలేయానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కానీ, GPR110 ఈ ఈస్ట్రోజన్ పనితీరును అడ్డుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

విశేషం ఏమిటంటే..? ఈ రిసెప్టర్ ప్రభావం మగ ఎలుకల్లో పెద్దగా కనిపించలేదు. అంటే, ఈ వ్యాధి పెరుగుదల అనేది స్త్రీ, పురుషుల్లో వేర్వేరు జీవక్రియల ద్వారా జరుగుతోందని స్పష్టమైంది.

జన్యుపరమైన లింక్..!

కేవలం జంతువుల్లోనే కాదు, మానవుల జన్యువులను విశ్లేషించినప్పుడు కూడా GPR110లో ఉండే కొన్ని మార్పులు మహిళల్లో కాలేయ వ్యాధుల ముప్పును పెంచుతున్నట్లు తేలింది. భవిష్యత్తులో కాలేయ వ్యాధులకు చికిత్స అందించేటప్పుడు స్త్రీ, పురుష భేదాలను పరిగణనలోకి తీసుకోవాలి. GPR110 రిసెప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని కొత్త మందులు తయారుచేస్తే, ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. కాలేయం మన శరీరంలోని అతిపెద్ద కర్మాగారం. దాని రక్షణ కోసం సరైన బరువు నిర్వహణ, పోషకాహారం తీసుకోవడం తప్పనిసరని ఈ పరిశోధన మరోసారి గుర్తుచేస్తోంది.

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.