జింక్ లోపాన్ని పరిష్కరించే ఎనిమిది ఆహారాలు.. 

సాక్షి లైఫ్ : జింక్ శరీరానికి అవసరమైన ఖనిజం. శరీర రోగనిరోధక వ్యవస్థ, జీర్ణక్రియ, నరాల పనితీరు, శారీరక పెరుగుదలను నిర్వహించ డానికి జింక్ ఎంతో అవసరం. జింక్ జీవక్రియ రేటును పెంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే జింక్ ఎక్కువగా లభించే ఆహారాలు ఏవి..? ఎలాంటివి తినడం ద్వారా జింక్ లోపాన్ని అధిగమించవచ్చు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

జింక్ లోపం ఉన్నవారు..

చిక్కుళ్ళు జింక్‌కి మంచి మూలం. అంతేకాదు శనగలు, తెల్ల శనగలు, బీన్స్ వంటి పప్పులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జింక్ లోపాన్ని అధిగమించవచ్చు. నట్స్ లో జింక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జింక్ లోపం ఉన్నవారు బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ మొదలైన వాటిని తినడం మంచిది. డార్క్ చాక్లెట్‌లో కూడా అధిక స్థాయిలో జింక్ ఉంటుంది. అంతేకాదు  యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ , మెగ్నీషియం వంటివాటికి ఇది అద్భుతమైన మూలం. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడమేకాకుండా రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

జింక్ పండ్లు, కూరగాయలలో పుష్కలంగా ఉంటుంది. అవోకాడో, జామ, దానిమ్మ, బచ్చలికూర ,బ్రోకలీలో ఎక్కువగా జింక్ ఉంటుంది. పాలు, చీజ్, పెరుగుతో సహా పాల ఉత్పత్తుల్లో కూడా జింక్  పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా హెల్తీ గా ఉండొచ్చు. గుడ్లు పోషకాల భాండాగారం. గుడ్లలో విటమిన్లు ఏ, బి, సి, ఇ ,కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఒక పెద్ద గుడ్డులో ఐదు శాతం జింక్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఓట్స్ లో..

ఓట్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని అణచివేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. చికెన్‌లో కూడా జింక్ ఉంటుంది. చికెన్ సూప్, గ్రిల్డ్ చికెన్ తీసుకోవడం ద్వారా జింక్ లోపం నుంచి బయటపడొచ్చు.

ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి..  జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

 ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health mental-health food-health zinc-deficiency zinc signs-of-zinc-deficiency zinc-deficiency-symptoms zinc-benefits zinc-deficiency-warning-signs zinc-health-impact health-benefits-of-zinc benefits-of-zinc best-sources-of-zinc
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com