Deadly Fungus Histoplasmosis : టెన్నెసీలో ప్రాణాంతక ఫంగస్ హిస్టోప్లాస్మోసిస్ కలకలం..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఒక ప్రమాదకరమైన ఫంగస్ వేగంగా విస్తరిస్తోంది. 'హిస్టోప్లాస్మోసిస్' (Histoplasmosis) అనే ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా గత మూడు నెలల్లోనే దాదాపు 35 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మౌరీ, విలియమ్సన్ కౌంటీ ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

 పక్షులు, గబ్బిలాలే కారణం..?

హిస్టోప్లాస్మా క్యాప్సులేటమ్ (Histoplasma capsulatum) అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా పక్షులు లేదా గబ్బిలాల విసర్జితాలు కలిసిన మట్టిలో ఈ ఫంగస్ పెరుగుతుంది. ఆ మట్టిని కదిలించినప్పుడు లేదా గాలి ద్వారా ఆ ఫంగస్ రేణువులు (Spores) మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడతారు. టెన్నెసీలో నమోదైన కేసుల్లో బాధితుల సగటు వయసు 50 ఏళ్లుగా ఉంది.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఈ ఫంగస్ శరీరంలోకి ప్రవేశించిన 3 నుంచి 17 రోజుల్లోపు లక్షణాలు బయటపడతాయి.

తీవ్రమైన జ్వరం, దగ్గు

అలసట, తలనొప్పి

ఒళ్లు నొప్పులు, చలి

ఛాతీ నొప్పి

ఈ లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూ మాదిరిగానే ఉండటంతో చాలా మంది దీనిని గుర్తించడంలో పొరబడుతుంటారు. ఫలితంగా సరైన సమయంలో చికిత్స అందక వ్యాధి ముదిరే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎవరికి ప్రమాదం ఎక్కువ అంటే..?

 రోగనిరోధక శక్తి ఉన్నవారికి దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ 
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.

ఎక్కువ సమయం బయట మట్టిలో లేదా అటవీ ప్రాంతాల్లో పనిచేసేవారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.

చికిత్స,నిర్ధారణ.. 

రక్త పరీక్షలు, మూత్ర పరీక్షల ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తించవచ్చు. అవసరమైతే ఎక్స్-రే, సీటీ స్కాన్ లేదా టిష్యూ బయాప్సీ కూడా చేస్తారు. చాలా మందికి ఇది దానంతట అదే తగ్గిపోయిన ప్పటికీ, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి 'యాంటీ ఫంగల్' మందులతో చికిత్స అందిస్తారు. ప్రస్తుతం ఈ ఫంగస్ వ్యాప్తికి గల ప్రధాన మూలాన్ని కనుగొనేందుకు ఆరోగ్య శాఖాఅధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.