No Need to Panic : స్క్రబ్‌ టైఫస్‌ కేసుల పెరుగుదలపై ఏపీ ఆరోగ్య శాఖ స్పందన..  

సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నమోదవుతున్న స్క్రబ్‌ టైఫస్‌ (Scrub Typhus) కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో సాధారణంగా నమోదయ్యే కేసుల సంఖ్య పరిధిలోనే ఇప్పటివరకు కేసులు ఉన్నాయని, దీనిని "వ్యాప్తి (Outbreak)"గా పరిగణించలేమని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

 

 సౌకర్యాల విస్తరణ..  

వ్యాధి నిర్ధారణ సౌకర్యాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) స్థాయి వరకు విస్తరించినట్లు కమిషనర్ వెల్లడించారు. అనుమానిత రోగుల నుంచి శాంపిల్స్ సేకరించి, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్క్రబ్‌ టైఫస్‌ అనేది సాధారణంగా వచ్చే కాలానుగుణ జ్వరాల్లో (Seasonal Fevers) ఒకటిగా ఆయన పేర్కొన్నారు.

9 మరణాలపై స్పష్టత రావాల్సి ఉంది.. 

ఇప్పటివరకు నమోదైన తొమ్మిది మరణాలను అనుమానిత కేసులుగానే పరిగణించాలని, స్క్రబ్‌ టైఫస్‌ వల్లే మరణాలు సంభవించాయని ఇంకా ధృవీకరించలేదని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు.

  కేసుల సంఖ్యలో తగ్గుదల..  

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP-IHIP) పోర్టల్ ద్వారా అందిన సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది (2025) 1,566 ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి.

 దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలో తగ్గిన కేసుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్: 2024లో 1,689 కేసులు, 2025లో 1,566 కేసులు.

కర్ణాటక: 2024లో 1,870 కేసులు, 2025లో 1,613 కేసులు.

తమిళనాడు: 2024లో 7,308 కేసులు, 2025లో 6,925 కేసులు.

తెలంగాణ: 2024లో 309 కేసులు, 2025లో 187 కేసులు.

ఆరోగ్య అధికారులు మాట్లాడుతూ, మెరుగైన నిఘా, విస్తృత పరీక్షలు, పద్ధతి ప్రకారం రిపోర్టింగ్ చేయడం వల్లే కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని, దీనిని వ్యాధి వ్యాప్తి పెరుగుదలగా పొరబడకూడదని సూచించారు. తాజా మరణాలకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి గుంటూరు, తిరుపతిలో సేకరించిన శాంపిల్స్‌కు సంబంధించిన జన్యు విశ్లేషణ (Genome Sequencing) ప్రక్రియ జరుగుతోందని, ఈ ఫలితాలు రావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు (RRTలు)..  

ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ (RRTలు) పంపారు. ఈ బృందాలు వ్యాధికి సంబంధించిన పరిశోధనలు (Epidemiological Investigations) నిర్వహిస్తాయి.

పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు.. 

హిందూపురం, టెక్కలి, పాడేరు, తెనాలి సహా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ, పంచాయతీ శాఖలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  ఎస్చార్ (Eschar) కీలకం.. 

మైట్ కీటకం కుట్టిన చోట ఏర్పడే నల్లని పొక్కు వంటి 'ఎస్చార్' (Eschar), జ్వరంతో పాటు కనిపిస్తే, అది స్క్రబ్‌ టైఫస్‌కు ముఖ్యమైన సంకేతం (Key Clinical Indicator) అని వైద్యులు సూచించారు.

గుంటూరు జీజీహెచ్‌లో పరిస్థితి..  

గత 38 రోజుల్లో గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH)లో 26 కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం ముగ్గురు రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

  యాంటీబయాటిక్స్‌తో చికిత్స..  

చాలా మంది రోగులు డాక్సీసైక్లిన్ (Doxycycline), అజిత్రోమైసిన్ (Azithromycin) వంటి సాధారణ యాంటీబయాటిక్స్‌తో త్వరగా కోలుకుంటున్నారని అధికారులు స్పష్టం చేశారు. ELISA పరీక్షల ద్వారా 24 గంటల్లోనే ఇన్‌ఫెక్షన్ ఉన్నదీ లేనిదీ నిర్ధారించవచ్చని తెలిపారు.

చర్యలు..  

 ఆరోగ్య శాఖ "స్క్రబ్‌ టైఫస్‌ యాక్షన్ ప్లాన్‌"ను సిద్ధం చేసింది. వారానికోసారి జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. హాట్‌స్పాట్ మ్యాపింగ్.. ఎక్కడెక్కడ ఇలాంటి వ్యాధి కేసులున్నాయో ఆయా ప్రాంతాలలో మరిన్ని కేసులుపెరగకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు. 24 VRDL ల్యాబ్‌లతో ప్రయోగశాల సామర్థ్యాన్ని పెంచడం. 17 మిలియన్లకు పైగా యాంటీబయాటిక్ టాబ్లెట్ల నిల్వ చేశారు. జ్వరంతో వచ్చే ప్రతి రోగిలో 'ఎస్చార్' కు సంబంధించిన పరీక్షలు  చేయాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : viral-fever lip-scrub-for-dry-lips scrub-typhus-andhra-pradesh ap-scrub-typhus-outbreak scrub-typhus-symptoms scrub-typhus-cases-ap scrub-typhus-prevention scrub-typhus-awareness
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com