సాక్షి లైఫ్ : చలికాలం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా విష జ్వరాలు, శ్వాసకోశ సంబంధిత ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరిగే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన 'చింతన్ శివిర్' సదస్సులో మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌గా పాల్గొని, రాష్ట్రాల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఇన్‌ఫ్లుయెంజా సీజన్ దృష్ట్యా ఆరోగ్య మౌలిక సదుపాయాల సామర్థ్యం, అన్ని సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేయడం చాలా అవసరమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ముఖ్యంగా సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా కేసుల పెరుగుదల దృష్ట్యా దేశవ్యాప్తంగా పూర్తి సంసిద్ధత, సమర్థవంతమైన యంత్రాంగాన్ని నిర్ధారించాలని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి జె.పి. నడ్డా సూచనలు జారీ చేశారు. భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్లుయెంజా తీవ్రమైన ప్రజారోగ్య సవాలుగా మిగిలిపోయింది, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని ప్రభావితం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
రియల్ టైమ్ పర్యవేక్షణ..
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) ద్వారా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో ఇన్‌ఫ్లుయెంజా కేసుల పరిస్థితిని రియల్-టైమ్లో పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజా సంసిద్ధత, ప్రతిస్పందన కోసం మంత్రిత్వ అంతర్-విభాగ సమన్వయాన్ని బలోపేతం చేయడంపై రెండు రోజుల మేధోమథన సమావేశంలో నడ్డా ప్రసంగించారు.
మంత్రి జారీ చేసిన ప్రధాన సూచనలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి, ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన వ్యూహాలను అమలు చేయాలి.
దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి.
'ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్' (IDSP) ద్వారా ప్రతి రాష్ట్రం కేసుల సరళిని ఎప్పటికప్పుడు గమనిస్తూ నివేదికలు అందించాలి.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వీలుగా ఆసుపత్రుల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
ప్రమాదకరమైన స్ట్రెయిన్స్ ఇవేనా..?
ప్రస్తుతం దేశంలో ప్రధానంగా H3N2, H1N1 అండ్ ఇన్‌ఫ్లుయెంజా బి (విక్టోరియా) రకాలు తీవ్రంగా వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి సాధారణ జ్వరంలాగే అనిపించినా.. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్ ఉపయోగించడం తప్పనిసరి.
వైద్యుల సలహా మేరకు ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ముప్పు తగ్గుతుంది.
తీవ్రమైన జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com