Creatine Supplements : క్రియేటిన్ సప్లిమెంట్స్ మజిల్స్ కే కాదు.. బ్రెయిన్ కూ టానిక్కే!
సాక్షి లైఫ్ : ప్రతిరోజూ జిమ్ కు వెళ్లే వాళ్లు, బాడీ బిల్డింగ్ చేసే వాళ్లు కండరాల పుష్టి కోసం 'క్రియేటిన్' అనే సప్లిమెంట్‌ను వాడుతుంటారు. అయితే ఇది కేవలం కండరాలు పెంచడానికే పరిమితం కాదని, మన శరీరంలోని అనేక ఇతర అవయవాలకు, ముఖ్యంగా మెదడు పనితీరుకు ఇది అద్భుతంగా తోడ్పడుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్(Adenosine Triphosphate)..
క్రియేటిన్ మన కణజాలంలో 'ఫాస్ఫోక్రియేటిన్' రూపంలో నిల్వ ఉంటుంది. ఇది కణాలకు ప్రధాన శక్తి వనరు అయిన అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ (Adenosine Triphosphate) ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రియేటిన్‌లో అత్యధిక భాగం కండరాల్లో ఉన్నప్పటికీ, గణనీయమైన శాతం మెదడులో కూడా ఉంటుంది.
మెదడుకు రక్షణ కవచం..
మెదడు నిరంతరం పని చేసే అవయవం కావడంతో దానికి శక్తి అవసరాలు ఎక్కువ. క్రియేటిన్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..? వృద్ధుల్లో వచ్చే మతిమరుపు (Cognitive decline) సమస్యను అరికట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు కణాలకు తక్షణ శక్తిని అందిస్తూ ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి లేదా నిద్రలేమి వల్ల కలిగే మానసిక అలసటను తగ్గించడానికి క్రియేటిన్ ఒక 'పవర్ బ్యాంక్'లా పనిచేస్తుంది.
అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో క్రియేటిన్ తోడ్పడుతుందని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ..
కేవలం మెదడుకే కాదు, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా క్రియేటిన్ సాయపడుతుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, కండరాలు చక్కెరను శక్తిగా మార్చుకునే ప్రక్రియను ఇది వేగవంతం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఎవరికి అవసరం అంటే..?
మాంసాహారం తీసుకునే వారికి కొంత వరకు సహజంగానే క్రియేటిన్ అందుతుంది. అయితే శాఖాహారులు, వృద్ధులు, మెదడుకు ఎక్కువ శ్రమ ఇచ్చే పనులు చేసే వారికి క్రియేటిన్ సప్లిమెంట్లు మేలు చేస్తాయి. ఎలాంటి సప్లిమెంట్లైనా తీసుకునే ముందు వైద్యనిపుణులను తప్పనిసరిగా సంప్రదించాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా మేరకు మాత్రమే వీటిని వినియోగించాలి.
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
