Excess Protein Intake : ప్రోటీన్ అతిగా తీసుకుంటే ప్రాణాలకు ముప్పు తప్పదా..?
సాక్షి లైఫ్ : నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరగడంతో చాలా మంది 'ప్రోటీన్' డైట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, జిమ్ ట్రైనర్లు ఇచ్చే సలహాలతో కొందరు మోతాదుకు మించి ప్రోటీన్ తీసుకుంటున్నారు. అయితే, శరీరానికి అసలు ఎంత ప్రోటీన్ అవసరం..? అతిగా తీసుకుంటే ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
రోజుకు ఎంత తీసుకోవాలి మరి..?
ఒక వ్యక్తి బరువును బట్టి ప్రోటీన్ అవసరం ఉంటుంది. సాధారణ వ్యక్తులు ప్రతి కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము ప్రోటీన్ సరిపోతుంది. అంటే 60 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు సుమారు 48-60 గ్రాముల ప్రోటీన్ అవసరమని ఐసీఎంఆర్ (ICMR), ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. క్రీడాకారులు,జిమ్‌కు వెళ్లేవారు.. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు కిలో బరువుకు 1.2 నుంచి 1.7 గ్రాముల వరకు తీసుకోవచ్చు. కండరాలు క్షీణించకుండా ఉండేందుకు 60 ఏళ్లు పైబడిన వారు కిలోకు 1.0 నుంచి 1.2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అతిగా తీసుకుంటే ఏమవుతుంది..?
అవసరానికి మించి ప్రోటీన్ తీసుకుంటే శరీరం దానిని నిల్వ చేసుకోదు. అదనపు ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసే క్రమంలో అవయవాలపై భారం పడుతుంది. రక్తంలోని ప్రోటీన్ వ్యర్థాలను వడకట్టడానికి కిడ్నీలు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలకు దారి తీయవచ్చు. ప్రోటీన్ జీర్ణం కావడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరం. తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది.
అధిక ప్రోటీన్ డైట్‌లో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉంటే మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా రెడ్ మీట్ ద్వారా ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటుంది.
ఏవి బెటర్ అంటే..?
కేవలం సప్లిమెంట్లపై ఆధారపడకుండా సహజ సిద్ధమైన ఆహారం ద్వారా ప్రోటీన్ పొందడం ఉత్తమం. పప్పు ధాన్యాలు, సోయా, పనీర్, మొలకెత్తిన గింజలు, బాదం, జీడిపప్పు. మాంసాహారులైతే కోడిగుడ్లు, చికెన్ అదికూడా స్కిన్‌లెస్, చేపలు తీసుకోవాలి. బాడీ బిల్డింగ్ పేరుతో లేదా బరువు తగ్గాలని ఇష్టమొచ్చినట్లు ప్రోటీన్ షేక్స్ వాడటం సరికాదని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వారు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
