శీర్షాసనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శీర్షాసనం (Headstand) యోగాసనాలలో ఒక ముఖ్యమైన ఆసనం. ఇద మనస్సును ప్రశాంతంగా ఉంచడమేకాకుండా, శక్తిని పెంచే ప్రక్రియ. ఈ ఆసనం చేసే సమయంలో తలపై నిలబడాల్సి ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణను పెంచి, శక్తిని అందిస్తుంది. శీర్షాసనం శరీరానికి, మనస్సుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీని సాధన వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీర శక్తి పెరుగుతుంది. శ్వాస వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఇది కూడా చదవండి..ఈ 10 ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు..?

ఇది కూడా చదవండి..హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలాంటి మహిళలకు అవసరం..?

ఇది కూడా చదవండి..పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకు తెలుసా..?

ఇది కూడా చదవండి..స్త్రీలలో క్యాల్షియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఏమిటి..?

  ముఖంలో కాంతి..

శీర్షాసనం చేసేటప్పుడు, శరీరంలో రక్త ప్రసరణ ముఖం, మెదడు వైపు ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ కాంతిని పెంచుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

 ఒత్తిడి తగ్గుతుంది.. 

ప్రతిరోజూ శీర్షాసన చేయడం వల్ల ఒత్తిడివంటి లక్షణాలను ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఆసనం చేస్తున్నప్పుడు, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉండడంవల్ల ఒత్తిడి తగ్గిపోతుంది.

 జుట్టు రాలు సమస్య .. 

శీర్షాసనం చేయడం వల్ల తలలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల తలకు పోషకాలు, ఆక్సిజన్ సరిగ్గా అందుతాయి. జుట్టు కుదుళ్లకు తగిన పోషకాహారం అందించడం వల్ల జుట్టు రాలడం సమస్య దూరమవుతుంది.

 జీర్ణక్రియను మెరుగుపడుతుంది.. 

శీర్షాసనం రోజూ చేయడం ద్వారా గ్యాస్ సమస్య తగ్గిపోతుంది, , జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ జరుగుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కూడా ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది.

 భుజాలు, చేతులకు.. 
 
రోజూ ఈ ఆసనం వేయడం వల్ల చేతులు, భుజాలు బలపడతాయి. దీనితో పాటు తల, మెడ, వీపు కండరాలు కూడా దృఢంగా మారుతాయి.

శీర్షాసనానికి కు సంబంధించిన జాగ్రత్తలు..  

ప్రారంభంలో శీర్షాసనం యోగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. అధిక రక్తపోటు, గ్లకోమా, మధుమేహం, పక్షవాతం, గుండె జబ్బులతో బాధపడేవారు ఈ ఆసనం వేయకూడదు. మెడ, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఉన్నా లేదా ఆస్టియోపొరోసిస్ ఉన్నా ఈ ఆసనం వేయకపోవడమే మంచిది. గర్భధారణ సమయంలో కూడా ఈ ఆసనం వేయకూడదు. 

 

ఇది కూడా చదవండి..మహిళల్లో క్యాల్షియం లోపాన్ని ఎలా నివారించాలి..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.