ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ ను తగ్గించే 5 సమ్మర్ డ్రింక్స్‌..

సాక్షి లైఫ్ : వేసవికాలంలో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వేడి తాకిడితో చెమటలు ఎక్కువగా పట్టి, గొంతు తడారిపోతుంటే డీహైడ్రేషన్ ప్రమాదం తలెత్తిందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాతావరణంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఐదు అద్భుతమైన పానీయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటంటే..?  

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఎండాకాలంలో డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు సర్వసాధారణం. చెమటలు ఎక్కువగా పట్టడంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ను తీసుకోవడం ద్వారా శరీరానికి చల్లదనం, శక్తి లభిస్తాయి. ఈ ఐదు రకాల పానీయాలు రుచి పరంగా అద్భుతంగా ఉండటమే కాకుండా, డీహైడ్రేషన్‌ను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.

  చెరకురసం..  

వేసవికాలంలో అత్యంతగా ఇష్టపడే డ్రింక్స్‌లో చెరకురసం ఒకటి. ఇందులో గ్లూకోజ్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అవసరమైన ఖనిజాలు ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.  

 ఆరోగ్యప్రయోజనాలు.. 

- డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది  
- జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది  
- కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది  
- షుగర్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కానీ డయాబెటిక్ ఉన్నవారు  వైద్యుడిని సంప్రదించాలి. 

ఎలా తాగాలి : నిమ్మరసం, చాట్ మసాలా కలిపి తాగితే రుచి మరింత పెరుగుతుంది.

  వెలగ పండు శరబత్..  

వెలగపండు ఎండాకాలంలో వరంలా పనిచేస్తుంది. దీనితో తయారుచేసిన  శరబత్ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాక, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  

ఆరోగ్య ప్రయోజనాలు..  

- పొట్టకు చల్లదనం అందిస్తుంది  
- జీర్ణశక్తిని పెంచుతుంది  
-వేడి నుంచి కాపాడుతుంది  
- శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది  

 ఎలా తాగాలి..? :  పండిన వెలగ గుజ్జును నీళ్లలో కలిపి, బెల్లం లేదా పంచదారతో తాగాలి.

 కొబ్బరి నీళ్లు..  

గరిష్ట ఉంషోగ్రతల సమయంలో అలసటను త్వరగా తొలగించే డ్రింక్ ఏదైనా ఉంది అంటే కొబ్బరి నీళ్లే. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. 
 
ఆరోగ్య ప్రయోజనాలు.. 
  
- డీహైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం  
- చర్మాన్ని మెరిసేలా చేస్తుంది  
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది  
- బరువు తగ్గడంలో సహాయపడుతుంది  

 ఎలా తాగాలి : ఉదయం ఖాళీ కడుపున లేదా ఎండలో నుంచి వచ్చిన వెంటనే తాగితే ఎక్కువ ప్రయోజనం.

 మజ్జిగ..  

భారతీయ గృహాల్లో సాంప్రదాయ డ్రింక్‌గా చెప్పుకునే మజ్జిగ ఎండల్లో ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో పెరుగు, నీళ్లు, సుగంధ ద్రవ్యాలు కలిపి తీసుకుంటే చల్లగా ఉంటుంది.  

ఆరోగ్యప్రయోజనాలు.. 

- పొట్టను చల్లగా ఉంచుతుంది  
- శరీరానికి చల్లదనం అందిస్తుంది  
- జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది  
- ఎసిడిటీ నుంచి ఉపశమనం 

 
 ఎలా తాగాలి : వేయించిన జీలకర్ర, ఉప్పు, పుదీనా కలిపి తాగాలి.

మామిడి పన్నా.. 

పచ్చి మామిడితో తయారైన మామిడి పన్నా ఎండల్లో వడ దెబ్బ నుంచి కాపాడే అద్భుతమైన ఇంటి చిట్కా. ఇందులో ఉండే పులుపు, తీపి రుచి శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి.  

ఆరోగ్య ప్రయోజనాలు.. 

-  వడ దెబ్బ నుంచి రక్షిస్తుంది  
- శరీరానికి చల్లదనం అందిస్తుంది  
- శక్తిని పెంచుతుంది  
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది  

 ఎలా తాగాలి :  ఉడికించిన పచ్చి మామిడి గుజ్జులో  ఉప్పు, జీలకర్ర పొడి, పుదీనా కలిపి చల్లగా తాగాలి.

 ఈ జాగ్రత్తలు తీసుకోండి: 

- కెఫీన్, కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి డీహైడ్రేషన్‌ను పెంచుతాయి.  
- రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి.  
ఈ డ్రింక్స్‌తో ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.  

 

 ఇది కూడా చదవండి..జామపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?

 ఇది కూడా చదవండి..గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : harmful-to-health healthy-food summer-health-tips healthy-habits summer-season summer overheat dehydration symptoms-of-dehydration summer-health summer-drnks summer-tips heat summer-alert summer-heat spicy-food heatwave heatwave-alert heat-waves
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com