AI-Suggested Diet Plans : ఏఐ సూచించే డైట్ ప్లాన్లతో ప్రాణాంతకమే.. పరిశోధకుల హెచ్చరిక..!
సాక్షి లైఫ్ : హోంవర్క్ దగ్గర నుంచి సలహాల వరకు ప్రతిదానికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌లపై ఆధారపడటం నేటి యువతకు అలవాటుగా మారింది. అయితే, బరువు తగ్గాలనుకునే టీనేజర్లకు ఈ చాట్‌బాట్‌లు ఇచ్చే డైట్ ప్లాన్లు అత్యంత ప్రమాదకరమని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. ప్రముఖ ఏఐ బాట్‌లు సూచించే ఆహార నియమాలు శరీరానికి అవసరమైన క్యాలరీలను భారీగా తగ్గించేస్తున్నాయని, ఇది ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని టర్కీకి చెందిన ఆరోగ్య పరిశోధకులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..Diabetes or High Blood Pressure : డయాబెటిస్ లేదా బీపీ ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
అధ్యయనంలో తేలిన షాకింగ్ నిజాలు..
క్యాలరీల లోపం..
పరిశోధకులు ఐదు ప్రధాన ఏఐ మోడళ్లను పరీక్షించగా.. అవి సూచించిన మీల్ ప్లాన్లలో ప్రతిరోజూ సుమారు 700 క్యాలరీల వరకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే, ఒక విద్యార్థి రోజుకు ఒక పూట భోజనం పూర్తిగా మానేస్తే ఎంత శక్తి కోల్పోతారో, అంత తక్కువ క్యాలరీలను ఇవి సిఫార్సు చేస్తున్నాయి. ఏఐ బాట్‌లు కార్బోహైడ్రేట్లను తగ్గించి, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలను (Fat) ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. ఇవి తగ్గితే ఎత్తు పెరగరని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.
క్యాలరీలు సరిగ్గా అందకపోతే..
క్యాలరీలు సరిగ్గా అందకపోతే టీనేజర్లలో హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతింటుంది. ఇది ఆడపిల్లల్లో నెలసరి సమస్యలకు, మగపిల్లల్లో శారీరక వికాసం మందగించడానికి కారణమవుతుంది. చదువుతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనే విద్యార్థులు (Student Athletes) ఇలాంటి లో-క్యాలరీ డైట్ పాటిస్తే.. 'రిలేటివ్ ఎనర్జీ డెఫిషియెన్సీ సిండ్రోమ్' (RED-S) బారిన పడే అవకాశం ఉంది. దీనివల్ల ఎముకలు బలహీనపడటం, తరచూ గాయాలపాలవ్వడం, క్రీడా సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అనేది కేవలం క్యాలరీలు తగ్గించడం మాత్రమే కాదు, శరీర వికాసానికి కావలసిన విటమిన్ డి, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలు అందేలా చూసుకోవడం. ఏఐ ఇచ్చే సమాచారం ప్రాథమికంగా ఉపయోగపడవచ్చు కానీ, ముఖ్యంగా ఆరోగ్యం,ఆహార విషయంలో నిపుణులైన డైటీషియన్ల సలహా తీసుకోవడమే ఉత్తమమని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
