మానవ మెదడుపై బర్డ్ ఫ్లూ తీవ్ర ప్రభావం.. నూతన అధ్యయనంలో వెల్లడి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అత్యంత వ్యాధికారక బర్డ్ ఫ్లూ (H5N1), క్షీరదాల మెదడులపై దాడి చేయడమే కాకుండా మానవ కేంద్ర నాడీ వ్యవస్థలోకి ప్రవేశించి, పార్కిన్సన్స్ , అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 

ఇది కూడా చదవండి..ఎలాంటి వాళ్లకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ..? 

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి..త్వరలో మధుమేహాన్ని అంతమొందించే ఔషధం..  

బర్డ్ ఫ్లూ.. 

బర్డ్ ఫ్లూ ఇప్పటికే ప్రపంచదేశాలలోనే కాకుండా భారతదేశంలోని పలు  రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ఈ వైరస్ క్షీరదాల మెదడులపై దాడి చేయడమే కాకుండా, మానవ కేంద్ర నాడీ వ్యవస్థలోకి ప్రవేశించి, పార్కిన్సన్స్ ,అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. 

భారతదేశంలో జంతువులు, మానవులపై H5N1 ప్రభావంపై పరిశోధన చేయగా చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయని, యునైటెడ్ స్టేట్స్ , యూరప్ వంటి పాశ్చాత్య దేశాలలో దాదాపు 50 జాతుల క్షీరదాలకు ఈ వ్యాధి సోకినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. 
 
అధిక జ్వరం, దగ్గు, జలుబు.. 
 
 H5N1 అనేది అధిక జ్వరం, దగ్గు, జలుబు, సాధారణ అనారోగ్య సమస్యలతో మొదలైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు సంబంధించిన లక్షణాలతోపాటు, మానవులలో మెదడు పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

ఇటువంటి అధ్యయనాలు 2009లోనే జరిగాయి. ఇందులో H5N1 వ్యాధికారక, ఇతర న్యూరోట్రోపిక్ ఇన్ఫ్లుఎంజా వైరస్ పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధులతో సహా ప్రోటీన్ అగ్రిగేషన్ కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు తలెత్తినట్లు పరిశోధనలు తెలిపాయి.

నాడీ సంబంధిత.. 

H5N1 ఇన్‌ఫెక్షన్ కు మనుషులలో నాడీ సంబంధిత ప్రభావానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి కాలిఫోర్నియా నేషనల్ ప్రైమేట్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన న్యూరో సైంటిస్ట్ డాక్టర్ డేనియల్ బెక్‌మాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “H5N1 వైరస్ మెదడుకు సాధారణ ఇన్ఫ్లుఎంజా కాదని న్యూరో సైంటిస్టులకు దశాబ్దాలుగా తెలుసని, సంబంధిత శాస్త్రీయ పత్రం 2009లో ప్రచురించినట్లు ఆయన చెప్పారు.

మెదడ్లపై దాడి.. 

H5N1పై నిపుణులను ఉటంకిస్తూ, 'బర్డ్ ఫ్లూ క్షీరదాల మెదడ్లపై దాడి చేస్తోంది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలోని కణాలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకునే సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా కంటే ఏవియన్ ఫ్లూ వైరస్‌లు మెదడుకు పెద్ద ముప్పును కలిగిస్తాయని జూలై 2024లో ప్రచురించిన సైన్స్‌న్యూస్ పేర్కొంది.

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.