New study : బ్లాక్ కాఫీతో కాలేయం, మెదడుకు రక్షణ..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం లేవగానే వేడివేడి టీ తాగే అలవాటు చాలామంది కి ఉంటుంది. అయితే పాలు, పంచదార లేని 'బ్లాక్ కాఫీ'ని దినచర్యలో చేర్చుకుంటే శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కెఫీన్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లాక్ కాఫీ శారీరక, మానసిక ఉల్లాసానికే కాకుండా కాలేయ ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

కాలేయానికి సహజ టానిక్..

దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు (Chronic Liver Disease), లివర్ సిర్రోసిస్, ఫైబ్రోసిస్ వంటి తీవ్ర సమస్యల ముప్పును తగ్గించడంలో బ్లాక్ కాఫీ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. రోజుకు 2 నుంచి 3 కప్పుల మేర తాగడం వల్ల కాలేయంపై కొవ్వు చేరకుండా అడ్డుకోవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

మెదడు చురుకుదనం.. ఉల్లాసమైన మూడ్..

శరీరంలో నిద్రమత్తు, బద్ధకానికి కారణమయ్యే 'అడెనోసిన్' అనే రసాయన ప్రభావాన్ని బ్లాక్ కాఫీలోని కెఫీన్ అడ్డుకుంటుంది. దీంతో మెదడు తక్షణమే చురుగ్గా మారుతుంది.నాడీవ్యవస్థలో 'డోపమైన్' విడుదలను ప్రేరేపించడం ద్వారా మానసిక స్థితిని (Mood) మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి మేలు..

పాలు, పంచదార లేకుండా తీసుకునే బ్లాక్ కాఫీలో క్యాలరీలు దాదాపు శూన్యం. ఇది శరీర మెటబాలిజం (metabolism) వేగాన్ని పెంచి కొవ్వు కరగడానికి దోహదపడుతుంది. వ్యాయామానికి ముందు దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం అలసిపోకుండా వర్కవుట్ చేయవచ్చు.

మధుమేహులూ తాగొచ్చా..?

బ్లాక్ కాఫీలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు టైప్-2 డయా బెటిస్ ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఇది ఇన్సులిన్ లేదా మధుమేహ ఔషధాలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకుంటూనే దీనిని మితంగా తీసుకోవాలి.

అతిగా తాగితే ముప్పే..!

ఆరోగ్యకరమైన పెద్దలు రోజుకు గరిష్ఠంగా 400 మిల్లీగ్రాముల కెఫీన్ అంటే సుమారు 3 నుంచి 4 కప్పుల కాఫీ వరకు తీసుకోవచ్చు. గర్భిణులు మాత్రం 200 మిల్లీగ్రాములకు మించకూడదు. అధికంగా తాగితే గుండెదడ, ఆందోళన, ఎసిడిటీ, రాత్రివేళ నిద్రలేమి (insomnia) వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి పరిమితంగా తీసుకున్నప్పుడే బ్లాక్ కాఫీ వల్ల సరైన ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.