సిగరెట్లు తాగడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% పెరుగుతుందని మీకు తెలుసా..?
సాక్షి లైఫ్ : పొగతాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొగలో ఉండే టాక్సిన్స్ మూత్రపిండాల కణజాలాలను దెబ్బతీస్తాయి, దీనివల్ల మూత్రపిండాలు క్రమంగా క్షీణిస్తాయి.అంతేకాకుండా టాక్సిన్స్ రక్తపోటును పెంచి, మూత్రపిండాల వైఫల్యానికి దారితీయవచ్చు. కాబట్టి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే..? తప్పనిసరిగా దూమపానం మానేయాలి.
ఇది కూడా చదవండి.ధూమపానం వల్ల శరీరంలోని ఈ 6 భాగాలు దెబ్బతింటాయి..
ఇది కూడా చదవండి.మీ పాదాల మీద ఈ ఏడు సంకేతాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరిగినట్టే..
ఇది కూడా చదవండి.. శుద్ధి చేయని నూనెలతో పోలిస్తే శుద్ధి చేసిన నూనెలు ఇన్సులిన్ నిరోధకతను ఎలా ప్రభావితం చేస్తాయి?
సిగరెట్ పొగ కళ్ళలోని సున్నితమైన రక్త నాళాలను దెబ్బతీస్తుంది, రక్త ప్రసరణను నెమ్మదిస్తుంది. దృష్టిని బలహీనపరుస్తుంది.ఎక్కువగా ధూమపానం చేయడం వల్ల త్వరగా కంటిశుక్లం, దృష్టి మసకబారుతుంది. సిగరెట్ తాగేవారికి మాక్యులర్ డీజెనరేషన్ (ఏఎమ్ డీ) వచ్చే ప్రమాదం 3 రెట్లు ఎక్కువ, ఇది వయసు పెరిగే కొద్దీ పూర్తిగా దృష్టిని కోల్పోయేలా చేస్తుంది. కళ్ళు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వీలైనంత త్వరగా సిగరెట్లకు దూరంగా ఉండడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
