సాక్షి లైఫ్ : ప్రతి రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం చాలా మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నిత్యం ఇలా బ్లాక్ కాఫీ తాగే అలవాటు చేసుకున్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లాక్ కాఫీ తాగే అలవాటున్న 21 వేల మందిపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. వీరి పరిశోధన ప్రకారం, కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. అందువల్ల భవిష్యత్తులో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, చాలా మంది ప్రజలు కాఫీ, కెఫిన్ గుండెకు మంచివి కావని నమ్ముతారు.