Experts Warn Against Rising AMR Threat: యాంటీబయాటిక్స్‌పై టాక్స్.. పెరుగుతున్న ఏఎంఆర్ ముప్పుపై నిపుణుల ఆందోళన.. 

షేర్ చేయండి:
Experts Warn Against Rising AMR Threat: యాంటీబయాటిక్స్‌పై టాక్స్.. పెరుగుతున్న ఏఎంఆర్ ముప్పుపై నిపుణుల ఆందోళన.. 

సాక్షి లైఫ్ : ఏ నొప్పి వచ్చినా కొందరు డాక్టర్లను సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు. ఇలా వేసుకోవడం వల్ల  ఫలితం ఉండకపోవడమేకాకుండా, దీనికి కారణంగా 'యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్' (AMR) సమస్య మరింతగా పెరుగుతుంది.  'యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్' అంటే..? సూక్ష్మజీవులు మందులను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడం. ఈ ప్రమాదకర ధోరణిని అరికట్టేందుకు యాంటీబయాటిక్స్‌పై వాటి తీవ్రతను బట్టి పన్నులు విధించాలని ప్రోగ్రెసివ్ జీఎస్టీ ప్రజారోగ్య నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

ముప్పును అరికట్టేందుకు 'మూడంచెల' పన్ను విధానం..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి బుర్రి కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వర్గీకరణ ప్రకారం యాంటీబయాటిక్స్‌పై పన్నులు ఇలా ఉండాలని సూచించారు:

సాధారణ మందులు (Access)..సామాన్యులకు అందుబాటులో ఉండేలా, సాధారణ ఇన్ఫెక్షన్లకు వాడే మందులపై కేవలం 5శాతం జీఎస్టీ మాత్రమే ఉండాలి. నిఘా మందులు (Watch)..ముప్పు ఎక్కువగా ఉండే యాంటీబయాటిక్స్‌పై 12శాతం పన్ను విధించాలి.

రిజర్వ్ మందులు (Reserve)..అతి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు వాడే 'చివరి అస్త్రం' వంటి మందులపై 24శాతం అంతకంటే ఎక్కువ పన్ను వేయాలి. దీనివల్ల ఈ మందుల విచ్చలవిడి వాడకం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

విచ్చలవిడిగా వాడడంతో ముప్పు.. 

చాలా సందర్భాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం కంటే, నేరుగా శక్తివంతమైన యాంటీబయాటిక్స్ కొనడం చౌకగా మారుతోంది. దీనివల్ల ప్రజలు అనవసరంగా హై-డోస్ మందులు వాడుతున్నారు. ఫలితంగా సాధారణ ఇన్‌ఫెక్షన్లు కూడా నయం కావడం కష్టమవుతోంది. ఆసుపత్రిలో ఉండే సమయం, వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి.

సర్జరీలు చేయించుకునే వారు, క్యాన్సర్ రోగులు, చిన్న పిల్లలకు ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతోంది. యాంటీబయాటిక్స్‌పై పన్నుల సంస్కరణలతో పాటు, కేంద్ర బడ్జెట్‌లో కనీసం 4 శాతం నిధులను ఆరోగ్య రంగానికి కేటాయించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. 'నిరంతర మహమ్మారి'గా మారుతున్న ఏఎంఆర్ (AMR)ను ఎదుర్కోవడానికి ఆర్థిక విధానాలే కీలక పాత్ర పోషిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.