CDC Report : మహిళల్లో పెరిగిన ఆయుర్దాయం.. ప్రధాన కారణాలు ఇవే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అమెరికా హెల్త్ హిస్టరీలో సరికొత్త రికార్డు నమోదైంది. గత కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చిన సగటు ఆయుర్దాయం (Life Expectancy) 2024లో అనూహ్యంగా పుంజుకుని, దేశ చరిత్రలోనే అత్యధికంగా 79 ఏళ్లకు చేరినట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) తాజాగా ప్రకటించింది. మహమ్మారి ప్రభావం తగ్గడం, వైద్య రంగంలో వచ్చిన మార్పులే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

కీలక గణాంకాలు.. 

 2023లో 78.4 ఏళ్లుగా ఉన్న సగటు ఆయుర్దాయం, 2024 నాటికి 79 ఏళ్లకు పెరిగింది. ఇది గతంలో 2014లో నమోదైన రికార్డును అధిగమించింది.

స్త్రీ, పురుషుల్లో వ్యత్యాసం..

 మహిళల ఆయుర్దాయం 81.4 ఏళ్లకు చేరగా, పురుషుల ఆయుర్దాయం 76.5 ఏళ్లుగా ఉంది. 2023తో పోలిస్తే 2024లో మరణాల రేటు సుమారు 3.8 శాతం తగ్గింది.

ఆయుష్షు పెరగడానికి కారణాలేంటంటే..?

నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ఐదు అంశాలు కీలక పాత్ర పోషించాయి. గత కొన్ని ఏళ్లుగా ప్రాణాలను హరించిన కోవిడ్-19 మరణాలు గణనీయంగా తగ్గాయి. టాప్-10 మరణాల జాబితా నుంచి కోవిడ్ తొలిసారిగా బయటకు వెళ్లిపోయింది. ఆధునిక చికిత్సలు, మెరుగైన జీవనశైలి మార్పుల వల్ల గుండె సంబంధిత మరణాలు 3 శాతం తగ్గాయి. క్యాన్సర్ నిర్ధారణలో కొత్త సాంకేతికత, చికిత్సల వల్ల మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రమాదవశాత్తూ జరిగే మరణాలు, ముఖ్యంగా డ్రగ్ ఓవర్ డోస్ వల్ల సంభవించే మరణాలు దాదాపు 14 శాతం తగ్గుముఖం పట్టాయి.

 కొత్త తరం బరువు తగ్గే మందులు (Weight management drugs) కూడా పరోక్షంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గించాయి.

ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు..

రికార్డు స్థాయిలో ఆయుర్దాయం పెరిగినప్పటికీ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అమెరికా ఇంకా వెనుకబడే ఉంది. జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో సగటు ఆయుర్దాయం 80 ఏళ్లకు పైనే ఉంది. అమెరికాలో ఇంకా ఆత్మహత్యలు, తుపాకీ హింస వంటి సవాళ్లు ఆయుర్దాయంపై ప్రభావం చూపుతున్నట్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఇది నిజంగా శుభపరిణామం. అన్ని వర్గాల ప్రజల్లోనూ మరణాల రేటు తగ్గడం ఆరోగ్య వ్యవస్థ పురోగతికి నిదర్శనమని సిడిసి గణాంక విభాగానికి చెంది రాబర్ట్ అండర్సన్ అన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల మనిషి జీవన కాలాన్ని మరింత పెంచుకోవచ్చని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.