SleepFM: ఒక్క రాత్రి నిద్రతో..130 వ్యాధులను గుర్తించొచ్చు..! స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ SleepFM

సాక్షి లైఫ్ : మనిషి ఆరోగ్యంలో నిద్రది కీలక పాత్ర. అయితే, ఆ నిద్రనే ఒక రోగ నిర్ధారణ పరీక్షగా మార్చవచ్చని నిరూపిస్తున్నారు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ పరిశోధకులు. వారు అభివృద్ధి చేసిన 'SleepFM' అనే ఏఐ వ్యవస్థ, కేవలం ఒక్క రాత్రి నిద్ర డేటాను విశ్లేషించడం ద్వారా.. సదరు వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే 130 రకాల వ్యాధులను, చివరికి మరణ ముప్పును కూడా ముందే పసిగట్టగలదని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

 పరిశోధనలో.. 

 పరిశోధనలో భాగంగా 2 ఏళ్ల నుంచి 96 ఏళ్ల వయసు గల సుమారు 65,000 మందికి చెందిన 5.85 లక్షల గంటల నిద్ర రికార్డింగులను విశ్లేషించారు. "నిద్రపోతున్నప్పుడు మన శరీరం అనేక సంకేతాలను (Signals) పంపిస్తుంది. ఎనిమిది గంటల పాటు ఒకే చోట నిశ్చలంగా ఉండే వ్యక్తి శరీరంలోని ఫిజియాలజీని అధ్యయనం చేయడం ద్వారా అద్భుతమైన సమాచారాన్ని సేకరించవచ్చు" అని ఈ అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ మిగ్నోట్ వివరించారు.

 ఖచ్చితత్వంతో..

ఏయే వ్యాధులను గుర్తించవచ్చు? ఈ ఏఐ వ్యవస్థ 80 శాతానికి పైగా ఖచ్చితత్వంతో పలు అనారోగ్య సమస్యలను ముందే పసిగడుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. క్యాన్సర్..ప్రాణాంతక కణితిల పెరుగుదల సంకేతాలు. మెదడు సంబంధిత వ్యాధులు.. డిమెన్షియా, పార్కిన్సన్ వ్యాధి. గుండె సమస్యలు.. రక్త ప్రసరణలో లోపాలు, ఇతర గుండె జబ్బులు. మానసిక రుగ్మతలు.. కుంగుబాటు (Depression), ఆందోళన వంటి సమస్యలు. గర్భిణుల్లో వచ్చే అనారోగ్య సమస్యలు.

వైద్య రంగంలో కొత్త మలుపు సాధారణంగా ఏఐ సాంకేతికతను గుండె (Cardiology) లేదా వ్యాధి నిర్ధారణ శాస్త్రం (Pathology) లో ఎక్కువగా వాడుతుంటారు. కానీ, నిద్రపై ఇలాంటి లోతైన అధ్యయనం జరగడం ఇదే మొదటిసారి అని పరిశోధకులు జేమ్స్ జౌ తెలిపారు. వ్యాధి లక్షణాలు బయటపడటానికి కొన్నేళ్ల ముందే ఈ ఏఐ ద్వారా హెచ్చరికలు అందుతాయని, తద్వారా నివారణ చర్యలు చేపట్టవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : new-study research scientists sleeping sleep-research sleepfm-technology disease-detection-through-sleep one-night-sleep-health-test,-detect-130-diseases sleep-based-diagnosis sleep-research-breakthrough
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com