Immune System : టాటూల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతుందా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి తరం యువతలో టాటూలు (Tattoos) వేయించుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. అయితే, చర్మంపై అందంగా కనిపించే ఈ పచ్చబొట్లు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై (Immune System) ఊహించని రీతిలో ప్రభావం చూపుతున్నాయని తాజా అంతర్జాతీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ట్యాటూ సిరా కేవలం చర్మం పైపొరకే పరిమితం కాకుండా, శరీర లోపలి భాగాలకు చేరుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

శరీరంలోకి వెళ్లే సిరా ఏమవుతుంది..?

సాధారణంగా టాటూ వేయించుకున్నప్పుడు సిరా చర్మం కింద నిలిచిపోతుందని మనం భావిస్తాం. కానీ 'పీఎన్ఏఎస్' (PNAS) జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. టాటూ వేయించుకున్న కొద్ది నిమిషాల్లోనే సిరాలోని సూక్ష్మ కణాలు రక్తనాళాలు, లింఫాటిక్ వ్యవస్థ ద్వారా మన రోగనిరోధక వ్యవస్థకు కీలకమైన 'లింఫ్ నోడ్స్' (Lymph Nodes) కు చేరుతున్నాయి.


ఈ సిరాను హానికరమైన పదార్థంగా గుర్తించిన రోగనిరోధక కణాలు (Macrophages) వాటిని మింగేస్తాయి. అయితే, సిరాలోని రసాయనాల వల్ల ఆ కణాలు చనిపోయే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. లింఫ్ నోడ్స్‌లో ఈ సిరా కణాలు పేరుకుపోవడం వల్ల అక్కడ నెలల తరబడి 'ఇన్ఫ్లమేషన్' (వాపు) కొనసాగుతోంది.

వ్యాక్సిన్లపై ప్రభావం..?

ఈ పరిశోధనలో మరో విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. టాటూ వేయించుకున్న చోట లేదా దానికి దగ్గరగా ఉన్న లింఫ్ నోడ్స్ ప్రభావితం కావడం వల్ల, మనం వేయించుకునే కొన్ని రకాల టీకాల ఉదాహరణకు కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రభావం తగ్గే అవకాశం ఉందని ప్రాథమిక పరీక్షల్లో తేలింది. అయితే ఇన్ఫ్లుయెంజా వంటి మరికొన్ని టీకాలపై ఇది సానుకూల ప్రభావం చూపడం గమనార్హం.

ఇతర ఆరోగ్య ముప్పు.. 

స్వీడన్, డెన్మార్క్‌లో జరిగిన అధ్యయనాల ప్రకారం..పెద్ద పెద్ద టాటూలు ఉన్నవారిలో 'లింఫోమా' (Lymphoma) అనే రక్త క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమారు 21శాతం నుంచి 29శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తేలింది. ముఖ్యంగా ఎరుపు రంగు సిరా వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలెర్జీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అరచేతి కంటే పెద్ద పరిమాణంలో ఉండే టాటూల వల్ల రోగనిరోధక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 టాటూ వేయించుకునే ముందు వాడే సిరాలో భారలోహాలు (Heavy Metals) లేకుండా చూసుకోవాలి. కేవలం గుర్తింపు పొందిన, పరిశుభ్రత పాటించే స్టూడియోల్లోనే పచ్చబొట్లు వేయించుకోవాలి. శరీరంపై పెద్ద ఎత్తున టాటూలు వేయించుకునే ముందు అవి భవిష్యత్తులో ఏమైనా సమస్యలు కలిగిస్తాయా అనేది ఆలోచించడం చాలా ముఖ్యం. టాటూలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సమస్యలు వస్తాయని చెప్పలేం, కానీ జాగ్రత్తగా ఉండటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.