Lifestyle health problems : యువతలో పెరుగుతున్న 'ఎక్సర్‌సైజ్ ఇంటాలరెన్స్' కారణం ఏమిటంటే..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు కొంచెం దూరం నడిచినా లేదా మెట్లు ఎక్కినా విపరీతమైన ఆయాసానికి గురవుతున్నారు. జిమ్‌కు వెళ్లాలన్నా, వ్యాయామం చేయాలన్నా శరీరం సహకరించడం లేదు. పరీక్షలు చేయించుకుంటే ఊపిరితిత్తులు, గుండె అన్నీ సవ్యంగానే ఉన్నట్లు రిపోర్టులు వస్తాయి. మరి ఈ సమస్యకు కారణమేమిటి..? దీనినే వైద్య పరిభాషలో 'ఎక్సర్‌సైజ్ ఇంటాలరెన్స్'  అంటే వ్యాయామం పట్ల ఆసక్తి లేకపోవడంగా భావిస్తారు.

 

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

ఏమిటీ సమస్య..అంటే..?

వయసు, శారీరక దృఢత్వానికి తగ్గట్లుగా శారీరక శ్రమ చేయలేక పోవడమే ఈ స్థితి. ఊపిరితిత్తుల నిర్మాణం సాధారణంగా ఉన్నప్పటికీ, శ్రమ చేసినప్పుడు త్వరగా అలసిపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం దీని ప్రధాన లక్షణం.

ప్రధాన కారణాలు ఏమిటంటే..? 

ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మందిలో శారీరక దృఢత్వం (Conditioning) తగ్గింది. ప్రధాన నగరాల్లో పెరిగిన కాలుష్యం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. గంటల తరబడి కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కండరాలు, ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయి. అధిక బరువు, రక్తహీనత (Anaemia), మానసిక ఒత్తిడి, ధూమపానం, వేపింగ్ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడం.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

కొద్దిపాటి శ్రమకే విపరీతమైన ఆయాసం.

తల తిరగడం లేదా తేలికపాటి తలనొప్పి.

ఛాతీలో బిగుతుగా లేదా అసౌకర్యంగా అనిపించడం.

కొద్దిపాటి శ్రమ చేసినా గుండె వేగంగా కొట్టుకోవడం.

దీనికి పరిష్కారం ఎలా.. మరి..?  

ఈ సమస్యను సరైన జీవనశైలి మార్పుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒకేసారి కాకుండా, నెమ్మదిగా శారీరక శ్రమను పెంచాలి (Gradual activity). ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు మాస్కులు (N-95) ధరించడం, బయట వ్యాయామాలు నివారించడం ఉత్తమం.ధూమపానం, వేపింగ్ వంటి అలవాట్లను వెంటనే మానుకోవాలి.

చాలా మందిలో ఆయాసానికి కారణం ఊపిరితిత్తుల సమస్యలు కాదు, శారీరక దృఢత్వం తగ్గడమే. సరైన రీతిలో వ్యాయామం చేస్తే మళ్ళీ మునుపటి ఉత్సాహాన్ని పొందవచ్చని శ్వాసకోశ వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.