సాక్షి లైఫ్ : భయంకరమైన క్యాన్సర్ మహమ్మారిపై పోరాటంలో ప్రకృతి మరో అద్భుత రహస్యాన్ని విప్పింది. జపాన్‌లోని చెట్లపై నివసించే ఒక చిన్న కప్ప (Japanese Tree Frog) శరీరంలో క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే శక్తి గల బ్యాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 'జపాన్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' (JAIST) పరిశోధకులు జరిపిన ఈ ప్రయోగం వైద్య రంగంలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
ఇది కూడా చదవండి..Afternoon Nap: మధ్యాహ్నం నిద్ర.. వరమా..? శాపమా..?
ఇది కూడా చదవండి..Eye Health : డిజిటల్ యుగంలో కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..
ఇది కూడా చదవండి..Respiratory Diseases : శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులకు వైద్యనిపుణుల సూచనలు..!
క్యాన్సర్ కణాలను తుడిచిపెట్టే గుణం..
సాధారణంగా ఉభయచరాలు, సరీసృపాలకు క్యాన్సర్ రావడం చాలా అరుదు. ఈ అంశంపై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు, జపనీస్ చెట్టు కప్పల పేగుల్లో ఉండే 'ఎవింగెల్లా అమెరికానా' (Ewingella americana) అనే బ్యాక్టీరియాకు క్యాన్సర్ కణాలను తుడిచిపెట్టే గుణం ఉందని కనుగొన్నారు. ప్రయోగశాలలో ఎలుకలపై జరిపిన పరీక్షల్లో, ఈ బ్యాక్టీరియాను కేవలం ఒక్కసారి ఇంజెక్ట్ చేయగానే 100 శాతం ఫలితాలు వచ్చాయి. కొలొరెక్టల్ (పేగు) క్యాన్సర్ గడ్డలు పూర్తిగా కరిగిపోవడాన్ని చూసి పరిశోధకులు విస్మయం చెందారు.
రెండు విధాల దాడి..
ఈ బ్యాక్టీరియా క్యాన్సర్‌పై రెండు రకాలుగా దాడి చేస్తుంది. నేరుగా నాశనం.. శరీరంలోకి ప్రవేశించిన ఈ బ్యాక్టీరియా, నేరుగా క్యాన్సర్ గడ్డ (Tumor) ఉన్న చోటికే చేరుకుంటుంది. అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాతావరణంలో వేగంగా పెరిగి, క్యాన్సర్ కణాలను లోపలి నుంచే చిన్నాభిన్నం చేస్తుంది. అదే సమయంలో ఇది మన శరీరంలోని రోగనిరోధక కణాలను (T-cells, B-cells) ఉత్తేజపరుస్తుంది. దీంతో మన సొంత ఇమ్యూనిటీ కూడా క్యాన్సర్ కణాలపై యుద్ధానికి దిగుతుంది.
భవిష్యత్తులో 'వ్యాక్సిన్'లా పనిచేస్తుందాఅంటే..?
ఈ పరిశోధనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒకసారి ఈ చికిత్స పొందిన ఎలుకలలోకి మళ్ళీ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టినా, వాటికి తిరిగి క్యాన్సర్ రాలేదు. అంటే ఈ బ్యాక్టీరియా శరీరంలో ఒక 'ఇమ్యూన్ మెమరీ'ని సృష్టించి, భవిష్యత్తులో క్యాన్సర్ మళ్లీ రాకుండా రక్షణ కల్పిస్తోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ కంటే ఇది మెరుగ్గా పనిచేస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి హాని కలగకుండా కేవలం క్యాన్సర్ గడ్డలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం దీని ప్రత్యేకత. త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com