One Test to Detect Multiple Infections: ఒకే టెస్ట్ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల గుర్తింపు.. వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్ రివల్యూషన్..
సాక్షి లైఫ్ : ఇకపై వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లే రోగుల తిప్పలు తప్పనున్నాయి. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే వారు రకరకాల వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఒకే ఒక్క పరీక్షతో వివిధ రకాల ఇన్ఫెక్షన్లను గుర్తించే దిశగా భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అడుగులు వేస్తోంది. 'మల్టీప్లెక్స్ మాలిక్యులర్ డయాగ్నొస్టిక్స్' పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వైద్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
సమయం ఆదాతోపాటు..
ప్రస్తుతం ఎవరికైనా తీవ్రమైన జ్వరం వస్తే.. మొదట డెంగ్యూ, అది కాకపోతే మలేరియా, ఆపై టైఫాయిడ్ లేదా కోవిడ్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలు చేస్తున్నారు. ఒక రిపోర్ట్ నెగెటివ్ వస్తేనే మరో పరీక్షకు వెళ్లడం వల్ల సరైన వ్యాధి ఏమిటో తేలడానికి చాలా సమయం పడుతోంది.
నిర్ధారణ ఆలస్యమవ్వడం వల్ల అత్యవసర సమయంలో రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. విడివిడి పరీక్షల వల్ల రోగిపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకే ఐసీఎంఆర్ 'సింగిల్ రన్' టెస్టులను రూపొందిస్తోంది. దీని ద్వారా ఒకే నమూనాను పరీక్షించి, ప్రాథమికంగా ఉండే పలు రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలను నిమిషాల్లోనే పసిగట్టవచ్చు.
సూపర్ బగ్స్ నియంత్రణే లక్ష్యం..
వైద్యులకు వ్యాధి ఏమిటో స్పష్టంగా తెలియనప్పుడు, అన్ని రకాల క్రిములపై పనిచేసే 'బ్రాడ్ స్పెక్ట్రమ్' యాంటీబయోటిక్స్‌ను రోగులకు ఇస్తున్నారు. అనవసరంగా ఈ మందులు వాడటం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా వీటికి లొంగకుండా 'అంత్యంత శక్తివంతమైన బ్యాక్టీరియా' (AMR - Antimicrobial Resistance)గా మారుతోంది. 2024 నాటి ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. ఆసుపత్రుల్లో సాధారణ యాంటీబయోటిక్స్ కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తోంది.
కొత్త టెస్టింగ్ విధానం వల్ల వ్యాధి ఏదో వెంటనే తెలుస్తుంది కాబట్టి, ఖచ్చితమైన (Targeted) చికిత్స అందించవచ్చు. ఫలితంగా మందుల దుర్వినియోగం తగ్గుతుంది. మన దేశంలో ఎక్కువగా కనిపించే ఇన్ఫెక్షన్లను దృష్టిలో ఉంచుకుని ఈ కిట్లను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను గుర్తించేందుకు ఐసీఎంఆర్ ఇప్పటికే కొన్ని సాంకేతికతలను దేశీ సంస్థలకు బదిలీ చేసింది.
భవిష్యత్తులో మహమ్మారులు ప్రబలినప్పుడు కూడా వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ విధానం వల్ల వైద్యులు త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఐసీయూలో ఉన్న రోగులకు సెప్సిస్ వంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఈ పరీక్షలు ప్రాణదాతగా నిలుస్తాయి.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
