సాక్షి లైఫ్ : ప్రతి రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం చాలా మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నిత్యం ఇలా బ్లాక్ కాఫీ తాగే అలవాటు చేసుకున్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుందని కొలరాడో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లాక్ కాఫీ తాగే అలవాటున్న 21 వేల మందిపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. వీరి పరిశోధన ప్రకారం, కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. అందువల్ల భవిష్యత్తులో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కెఫిన్ గుండెకు..
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, చాలా మంది ప్రజలు కాఫీ, కెఫిన్ గుండెకు మంచివి కావని నమ్ముతారు. కాఫీని తాగడం వల్ల రక్తపోటును పెంచుతాయని భావిస్తుంటారు. కానీ కొత్త పరిశోధన ప్రకారం, కాఫీ గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ధూమపానం..
అయితే, ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ధూమపానం నుంచి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు. అమెరికన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో పాల్గొన్న 21 వేల మంది వ్యక్తుల డాటాను సేకరించారు.
రోజూ 1, 2, 3 కప్పుల కాఫీ తాగిన తరువాత, దాని ప్రభావాన్ని పరిశీలించారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె దడ వచ్చే ప్రమాదం 13 శాతం తగ్గుతుంది.
పరిశోధనలో..
కాఫీ తాగే అలవాటు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని తేలింది. చైనా మెడికల్ యూనివర్శిటీ తన ఇటీవలి పరిశోధనలో బ్లాక్ కాఫీ తాగే వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని 10 శాతం తగ్గినట్లు గుర్తించారు. క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు కాఫీ తాగడం 16 శాతం మేర మంచిదైందని చైనా పరిశోధకులు చెప్తున్నారు.
క్యాన్సర్ ప్రమాదాన్ని..
కాలేయం, రొమ్ము, పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని బ్లాక్ కాఫీ తగ్గిస్తుందని గత పరిశోధనలో నిరూపితమైంది. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లోని పబ్లిక్ రీసెర్చ్ ప్రకారం, తక్కువ, ఎక్కువ కాఫీని ఉపయోగించే వ్యక్తులపై ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పరిశోధకులు అర్థం చేసుకున్నారు.
బ్లాక్ కాఫీ తాగే వారిలో..
ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగుతున్న వ్యక్తులు ఇందులో ఉన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న 57,732 మంది రోగుల డేటాను కూడా పరిశోధనలో చేర్చారు. బ్లాక్ కాఫీ తాగే వారిలో ఆయుష్షు పెరుగడం, ఎనర్జీ బూస్టింగ్ పొందడం, శరీరం బరువు తగ్గిపోవడం, కాలేయం ఆరోగ్యవంతంగా తయారవడం, డిప్రెషన్‌కు గురికాకుండా ఉంటారని తేల్చారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com