Vision Through Sound : శబ్దంతో కంటిచూపు.. AI గ్లాసెస్ అంధులకు వరం.. !
సాక్షి లైఫ్ : చూపులేని వారి జీవితాల్లో సాంకేతికత కొత్త వెలుగులు నింపుతోంది. అంధత్వం, తీవ్ర దృష్టి లోపాలతో బాధపడే వారు తమ పరిసరాలను సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా 'ఏఐ స్మార్ట్ విజన్' కళ్లద్దాలను ఎయిమ్స్ (AIIMS) పంపిణీ చేసింది. శబ్దం ద్వారా ప్రపంచాన్ని 'చూసే' అద్భుత అవకాశం ఈ పరికరం కల్పిస్తోంది.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఎలా పనిచేస్తుంది అంటే..?
ఈ కృత్రిమ మేధ (AI) ఆధారిత కళ్లద్దాలు దృశ్య సమాచారాన్ని శబ్ద రూపంలోకి మారుస్తాయి. దీనివల్ల కలిగే ఉపయోగాలు..పుస్తకాల్లోని ముద్రిత అక్షరాలను, ఔషధాల లేబుళ్లను స్పష్టంగా చదివి వినిపిస్తాయి. ఎదురుగా ఉన్న వస్తువులను, వ్యక్తుల ముఖాలను గుర్తించగలవు. దారిలో ఉండే అడ్డంకులను పసిగట్టి, నావిగేషన్‌లో సహాయపడతాయి. కరెన్సీ నోట్లను గుర్తించడంలోనూ తోడ్పడతాయి.
ఎలాంటి వారికి ప్రయోజనం మరి..?
భారతదేశంలో దాదాపు కోటి మంది అంధత్వం లేదా తీవ్ర దృష్టి లోపంతో జీవిస్తున్నారు. ముఖ్యంగా గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి వంటి సమస్యలతో శాశ్వతంగా చూపు కోల్పోయిన వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. సర్జరీ ద్వారా చూపు రాని స్థితిలో, ఇవి స్వతంత్రంగా జీవించేందుకు తోడ్పడతాయి.
ప్రాజెక్ట్ దృష్ఠి (Project Drishti)..
'ప్రాజెక్ట్ దృష్ఠి'లో భాగంగా ఎయిమ్స్ ఇప్పటికే 53 మందికి ఈ పరికరాలను ఉచితంగా అందించింది. వీటి అసలు ధర సుమారు రూ.35,000 కాగా, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఐదో వెర్షన్‌కు చేరుకున్న ఈ అద్దాలు మునుపటి కంటే బరువు తక్కువగా, సెన్సార్లతో మరింత ఆధునికంగా రూపొందాయి. ఇవి కేవలం అసిస్టివ్ పరికరాలు మాత్రమే కాదు.. ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేసే సాధనాలని ఎయిమ్స్ డా. ప్రవీణ్ వశిష్ఠ్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
