సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పురుషులకు (Men) శుభవార్త! చికిత్సలో భాగంగా కేవలం రెండు క్యాన్సర్ ఔషధాలను కలిపి ఇవ్వడం వల్ల మరణ ప్రమాదం ఏకంగా 40 శాతం వరకు తగ్గుతున్నట్లు అంతర్జాతీయంగా జరిగిన ఒక సంచలన క్లినికల్ ట్రయల్ (Clinical Trial)లో తేలింది. సాధారణంగా ఇచ్చే హార్మోన్ థెరపీ (Hormone Therapy)కి అదనంగా ఎన్జాలుటమైడ్ (Enzalutamide) అనే మరో శక్తివంతమైన ఔషధాన్ని కలిపి ఇవ్వడం ద్వారా ఈ అద్భుత ఫలితం కనిపించినట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఎలాంటి వారికి ప్రయోజనం అంటే..?
సర్జరీ (Surgery) లేదా రేడియేషన్ థెరపీ (Radiation Therapy) తీసుకున్న తర్వాత మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టిన (Recurrent Prostate Cancer) హై-రిస్క్ (High-Risk) రోగుల్లో ఈ చికిత్స అద్భుతంగా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
మనుగడలో తేడా..
ఎనిమిదేళ్ల ఫాలో-అప్ తర్వాత.. కేవలం హార్మోన్ థెరపీ తీసుకున్నవారితో పోలిస్తే, రెండు ఔషధాలను తీసుకున్న రోగుల్లో ప్రాణాపాయ ముప్పు 40.3 శాతం తక్కువగా నమోదైంది.
కొత్త ప్రమాణం (New Standard)..
ఈ ఫలితాలు ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో ఇదొక 'గేమ్ ఛేంజర్' అని, ఈ కాంబినేషన్ థెరపీ త్వరలోనే ప్రామాణిక చికిత్సగా మారనుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిశోధన ఫలితాలు "ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్"లో ప్రచురితమయ్యాయి. 70 ఏళ్ల వయసులో క్యాన్సర్ తిరగబెట్టిన రోగులు కూడా ఈ చికిత్సతో దాదాపు మరో 15 ఏళ్ల పాటు జీవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఔషధాల కాంబినేషన్ కొంతమందిలో అలసట, లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి దుష్ప్రభావాలకు (Side Effects) దారితీయవచ్చు. కాబట్టి, చికిత్స ప్రారంభించే ముందు మీ వయసు, క్యాన్సర్ తీవ్రత ఆధారంగా చికిత్స, ప్రయోజనాలు, ఇబ్బందుల గురించి వైద్యనిపుణులతో తప్పకుండా చర్చించాలి.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com