Japanese Scientists : జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన..! : గోరింటాకుతో కాలేయ సమస్యలకు చెక్..?

సాక్షి లైఫ్ : జుట్టుకు రంగు వేయడానికి, చేతులకు అందం పెంచడానికి ఉపయోగించే సహజమైన గోరింటాకు (Henna) కేవలం సౌందర్య సాధనం మాత్రమే కాదు... ప్రాణాంతక కాలేయ (Liver) వ్యాధులను కూడా నయం చేయడంలో అద్భుతంగా పనిచేయగలదని జపాన్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. సహజ సిద్ధమైన ఈ మొక్క రంగు, కాలేయ నష్టాన్ని (Liver Damage) తిప్పికొట్టి, ఫైబ్రోసిస్‌ను (Fibrosis) రిపేర్ చేయడంలో సహాయపడుతుందని వారి అధ్యయనం వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి..ఐయోడిన్ లోపం గర్భిణీలకు, పిల్లలకు అత్యంత ప్రమాదకారమా ఎందుకు..? 

ఇది కూడా చదవండి..Job Stress : జాబ్ స్ట్రెస్ తోనే సంతానలేమి..? వైద్యనిపుణులు ఏమంటున్నారు..?

ఇది కూడా చదవండి..ORS : 'నకిలీ ORS' అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

 

పరిశోధనలో తేలిన కీలక అంశాలు ఏమిటి..?  

 గోరింటాకులో ఉండే ఒక సహజ రసాయన సమ్మేళనం (Compound), కాలేయం గట్టిపడటానికి (Liver Fibrosis) కారణమయ్యే ప్రక్రియను అడ్డుకుంటుందని, ఇప్పటికే దెబ్బతిన్న కాలేయాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుందని జపాన్ కు చెందిన ఒసాకా విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు.

 కాలేయ నష్టం తీవ్రమైనప్పుడు "ఫైబ్రోసిస్" (కణజాలం గట్టిపడటం) జరుగుతుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, అధిక మద్యపానం లేదా ఫ్యాటీ లివర్ (Fatty Liver) వంటి సమస్యల వల్ల ఇది వస్తుంది. గోరింటాకులోని రసాయనం ఈ ఫైబ్రోసిస్‌ను తిప్పికొట్టే (Reverse) సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

గోరింటాకు కాలేయ కణాలలో ఎలా పనిచేస్తుంది, ఏయే మార్పులను ప్రేరేపించి కాలేయ పునరుద్ధరణకు (Liver Repair) తోడ్పడుతుందనే అంశాలపై పరిశోధనలు మరింత లోతుగా జరుగుతున్నాయి. కాలేయ మార్పిడి (Liver Transplant) లేదా దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే ఫైబ్రోసిస్, సిరోసిస్ (Cirrhosis) వంటి సమస్యలకు గోరింటాకులోని ఈ సహజ పదార్థం భవిష్యత్తులో సమర్థవంతమైన, సురక్షితమైన ఔషధంగా మారే అవకాశం ఉందని తాజా అధ్యయనం వైద్య ప్రపంచంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : liver-damage liver-health liver-infection natural-colors fatty-liver scientific-evidence remedies-for-a-fatty-liver chronic-liver-disease scientific-discovery japanese-lifestyle natural-health henna liver-fibrosis reverse-fibrosis japanese-scientists natural-plant-dye henna-compound hepatology natural-cure japan-scientific-research
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com