భారత్‌లో డయాబెటిస్‌ బాధితులకు ఊరటనిచ్చే కొత్త ఆవిష్కరణ..!  

సాక్షి లైఫ్ : ప్రపంచంలోనే మధుమేహానికి రాజధానిగా మారుతున్న భారత్‌కు ఊరటనిచ్చే కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. లక్షల మంది భారతీయులను పట్టి పీడిస్తున్న టైప్‌-2 డయాబెటిస్ (Type-2 Diabetes), దాని అనుబంధ సమస్యలైన కిడ్నీ జబ్బుల ప్రమాదాన్ని ముందే పసిగట్టేందుకు వీలు కల్పించే రహస్య రక్తపు గుర్తులను (Hidden Blood Markers) శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ఐఐటీ బాంబే (IIT Bombay) పరిశోధకులు చేసిన ఈ సంచలనాత్మక అధ్యయనం, దేశంలో మధుమేహ నిర్ధారణ, చికిత్స విధానాన్ని సమూలంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్ఠాత్మక 'జర్నల్ ఆఫ్ ప్రొటియోమ్ రీసెర్చ్' (Journal of Proteome Research) లో ప్రచురితమయ్యాయి.

 ఏం కనుగొన్నారు అంటే..?

సాధారణంగా చేసే రక్త పరీక్షలు (ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, HbA1c) కేవలం చక్కెర స్థాయిలనే చూపిస్తాయి. కానీ, మధుమేహం అనేది చక్కెర సమస్య మాత్రమే కాదని, శరీరంలోని అమైనో ఆమ్లాలు, కొవ్వులు వంటి అనేక జీవక్రియలను (metabolic) ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తేల్చారు.

మెటబోలోమిక్స్ (Metabolomics) అనే అధునాతన సాంకేతికతను ఉపయోగించి, మధుమేహం ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారి రక్తాన్ని పోల్చి చూశారు. ఈ అధ్యయనంలో 26 రకాల మెటబోలైట్‌లు అంటే చిన్న అణువులు డయాబెటిక్ రోగులలో భిన్నంగా ఉన్నట్లు కనుగొన్నారు.

వీటిలో వాలెరోబెటైన్, రిబోథైమిడైన్, ఫ్రక్టోసిల్-పైరోగ్లుటమేట్ వంటి కొన్ని గుర్తులు ఇంతకుముందు మధుమేహంతో ముడిపడి లేవని గుర్తించారు. ఇది, మధుమేహం కేవలం గ్లూకోజ్ నియంత్రణ లోపం కాదని, విస్తృత జీవక్రియ రుగ్మత అని సూచిస్తోంది.

  కిడ్నీ సమస్యలకూ ముందస్తు సంకేతం.. 

మధుమేహం ఉన్నవారిలో దాదాపు మూడింట ఒక వంతు మందికి దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బులు (CKD) వచ్చే ప్రమాదం ఉంది. ఈ రక్తపు గుర్తులు కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని కూడా ముందుగా పసిగట్టేందుకు తోడ్పడతాయని పరిశోధకులు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నవారి నుండి కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న డయాబెటిక్ రోగుల వరకు.. క్రమంగా పెరుగుతున్న ఏడు మెటబోలైట్‌లను ఉదా: అరబిటాల్, మైయో-ఇనోసిటాల్ ఈ బృందం గుర్తించింది. కిడ్నీ దెబ్బతిన్నప్పుడు పెరిగే 2PY అనే విషతుల్య సమ్మేళనం కూడా వీటిలో ఉంది.

  భవిష్యత్తులో ప్రయోజనాలున్నాయి.. 

 సాధారణ లక్షణాలు కనిపించటానికి, పాత పరీక్షల్లో బయటపడటానికి చాలా ఏళ్ల ముందే ఈ గుర్తుల ద్వారా ప్రమాదాన్ని పసిగట్టవచ్చు.

వ్యక్తిగత చికిత్స: ప్రస్తుతం అనుసరిస్తున్న 'అందరికీ ఒకే విధానం' కాకుండా, రోగి ప్రత్యేక జీవక్రియల ఆధారంగా వ్యక్తిగతంగా చికిత్స (Personalised Treatment) అందించడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది.

వేలి నుంచి తీసిన రక్తపు చుక్క (Dried Blood Spots) తోనే ఈ పరీక్షను నిర్వహించేలా సరళమైన, చౌకైన కిట్‌ను అభివృద్ధి చేసేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. దేశంలో డయాబెటిస్ మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో, ఈ కొత్త పరిశోధన ఒక ఆశాకిరణం లాంటిదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా సకాలంలో జోక్యం చేసుకుని, తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని వారు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes diabetes-affect diabetes-risk diabetes-patients diabetes-risk- how-to-beat-diabetes innovation medical-innovation dragon-fruit-benefits-for-diabetes type-1-diabetes what-is-diabetes prediabetes-treatment reverse-prediabetes
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com