Harmful Bacteria Threatening Himalayan Peaks : హిమాలయ శిఖరాలకు హానికరమైన బ్యాక్టీరియా: "బోస్ ఇన్‌స్టిట్యూట్" శాస్త్రవేత్తలహెచ్చరిక..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: హిమాలయాలలోని స్వచ్ఛమైన గాలి, అతి శీతల వాతావరణం వ్యాధుల నుంచి సహజ రక్షణ కల్పిస్తాయని మనం నమ్ముతాం. కానీ, అక్కడకు కూడా అదృశ్య శత్రువులు చేరుకుంటున్నారని తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. పశ్చిమ భారత దేశంలోని ఎడారుల నుంచి వీచే ధూళి తుపానులు హిమాలయ శిఖరాలకు హానికరమైన బ్యాక్టీరియాను మోసుకెళ్తున్నాయని 'బోస్ ఇన్‌స్టిట్యూట్' శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

వందల కిలోమీటర్ల ప్రయాణం..

ప్రీ-మాన్‌సూన్ అంటే రుతుపవనాల ముందు సమయంలో రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతాల్లో ధూళి తుపానులు సాధారణం. ఇవి ఎడారి నేల నుంచి కేవలం ఖనిజ రేణువులనే కాకుండా, వాటికి అంటుకుని ఉండే సూక్ష్మజీవులను కూడా గాల్లోకి లేపుతాయి. ఇవి గాలివాటంతో ఇండో-గంగా మైదానాల మీదుగా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, చివరకు హిమాలయ పర్వతాల పైభాగంలో స్థిరపడుతున్నాయి. రెండు ఏళ్లకు పైగా నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు 'సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

పొంచి ఉన్న ఆరోగ్య ముప్పు.. 

ఈ గాలి ద్వారా వచ్చే బ్యాక్టీరియా వల్ల హిమాలయ ప్రాంత ప్రజలకు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలోని రోగకారక క్రిములు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. బ్యాక్టీరియా సోకడం వల్ల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కలుషితమైన గాలి, నీటి ద్వారా పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు కలగవచ్చు.

స్థానిక కాలుష్యంతో తోడై..

కేవలం ఎడారి బ్యాక్టీరియా మాత్రమే కాకుండా, హిమాలయ పర్వత పాదాల (foothills) వద్ద ఉన్న స్థానిక కాలుష్య కారకాలు, సూక్ష్మజీవులు కూడా గాలి పైపొరల్లోకి చేరుతున్నాయి. ఈ రెండు రకాల బ్యాక్టీరియాలు కలిసి హిమాలయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని పరిశోధనలో తేలింది. ఇప్పటికే గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉండి, చలి తీవ్రత ఎక్కువగా ఉండే హిమాలయ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై ఈ బ్యాక్టీరియా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు.. 

ఇది కూడా చదవండి..Health care : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే చెర్రీస్..

ఇది కూడా చదవండి..Methi side effects : మెంతులు ఎక్కువగా తీసుకున్నా సమస్యే.. 

ఇది కూడా చదవండి..For stress less life : మెంటల్ స్ట్రెస్ తగ్గించే ఆరోగ్యకరమైన నియమాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.