సాక్షి లైఫ్: పురుగుమందులతో పండిన పంటలు, పండ్లు కూరగాయలతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతుండడంతో చాలామంది సేంద్రియ పద్దతిలో సాగైన ఆహారంపై ఆసక్తి చూపిస్తున్నారు. "ఆర్గానిక్ "పేరుతో చాలా మంది వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. అసలు ఆర్గానిక్ పద్ధతి ద్వారా పండించిన పండ్లను ఎలా గుర్తించవచ్చు..? అందుకోసం ఎలాంటి టిప్స్ పాటించవచ్చు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
యాంటీ ఆక్సిడెంట్స్..
సేంద్రియ ఆహారోత్పత్తులలో స్థూల, సూక్ష్మ పోషకాలతోపాటు వ్యాధి నిరోధకశక్తిని పెంచే ‘యాంటీ ఆక్సిడెంట్స్’ వంటి విశిష్ట పోషకాలు అత్యధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి ! కొన్ని సేంద్రియ ఉత్పత్తుల్లో రెట్టింపు ఉండగా, మరికొన్నిటిలో వేల రెట్లు అదనంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ రసాయన సాంకేతిక సంస్థ చేసిన పరీక్షల్లో వెల్లడైంది.
ఆర్గానిక్ పండ్ల విషయంలో..
ఆర్గానిక్ పండ్ల విషయంలో రుచి, వాసన ఖచ్చితంగా చూడాలి. ఆర్గానిక్ పండ్లతో పోల్చితే రసాయన ఎరువులు వేసి పండించిన పండ్లుమంచి వాసన, రుచి కలిగి ఉంటాయి. అంతే కాదు.. ఇలా పండించిన పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. అదే ఆర్గానిక్ పండ్లు కాస్త పులుపు ఉంటాయి. అయితే సహజంగా పండించినవి రుచి కూడా చాలా బాగుంటాయి.
ఎక్కువగా గింజలు..
ఆర్గానిక్ పండ్లల్లో గింజలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదా హరణకు బొప్పాయి, జామ, యాపిల్ వంటివి చూస్తే సహజసిద్ధంగా పండించిన వాటిలో చాలా ఎక్కువగా గింజలు కనిపిస్తాయి.పెద్ద సైజ్ లోని పండ్లను చూసి చాలామంది బావున్నాయి కదా అని భావించి వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతారు.
రసాయన ఎరువులు..
కానీ కేవలం రసాయన ఎరువులను ఉపయోగించి పండించే కూరగాయలు మాత్రమేపెద్ద సైజ్ లో ఉంటాయి. ఆర్గానిక్ కూరగాయలు ఎరువులు ఉపయోగించకుండా పండిస్తారు. కాబట్టి వాటి సైజ్ చిన్నగా ఉంటాయి. అయితే హైబ్రిడ్ జాతివైతే ఆర్గానిక్ అయినా కాస్త పెద్ద సైజ్ లోనే ఉంటాయి. దేశవాళి పండ్లను ఈ విధంగా తేడా గుర్తించ వచ్చు.
రసాయన పంటలతో పోల్చుకుంటే..
ఆర్గానిక్ ఫ్రూట్స్ రసాయన ఎరువులు వేసిన వాటితో పోల్చుకుంటే రంగులో, షేప్ లో కాస్త తేడాగా ఉంటాయి. అవి చూసేందుకు పెద్దగా అందంగా కనిపించవు. అలాగే రెండు కాయలు లేదా పండ్లు తీసుకుంటే ఆ రెండు విభిన్న పరిమాణాలు, భిన్నమైన ఆకృతుల్లో ఉంటాయి.
సహజంగా పెంచిన పండ్ల కోసం..
వాటి చర్మం కూడా బరకగా ఉంటుంది. చాలామంది పండ్లలో ఎలాంటి పురుగులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ సహజంగా పెంచిన పండ్ల కోసం ఎలాంటి ఎరువులు ఉపయోగించట్లేదు కాబట్టి వీటిలో పురుగులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఒకవేళ పురుగులు కనిపిస్తే వాటికి పురుగుల మందులు తక్కువగా ఉపయోగించా రని భావించి వాటిని వెంటనే కొనుగోలు చేయడం మంచిది. ఇందుకు గాను మీరు ఉప్పు వేసిన నీటిలో వాటిని నానబెట్టి తర్వాత వండుకోవడం లేదా నేరుగా తినవచ్చు.
జీవిత కాలం చాలా తక్కువ..
సేంద్రియ ఆహార పదార్థాల జీవిత కాలం చాలా తక్కువ. ఇవి కోసిన నాలుగైదు రోజుల్లోనే పాడైపోతాయి. సాధారణ ఉష్ణోగ్రత వద్ద రెండు మూడు రోజుల కంటే వీటిని ఉంచకపోవడం మంచిది. కావాలంటే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. అదే పురుగుల మందులు జల్లి పండించిన పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
ఈ గుర్తులను బట్టి ఆర్గానిక్ పండ్లను గుర్తించవచ్చు..
ఈ గుర్తులను బట్టి ఆర్గానిక్ పండ్లను గుర్తించి వాటిని కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఎక్కువ ధరకు కెమికల్స్ వాడిన ఉత్పత్తులు కొనకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాదు ఆర్గానిక్ ఫుడ్ పేరుతో జరిగే మోసాలకు చెక్ పెట్టి, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను పొందే వీలుకలుగుతుంది.
ఆర్గానిక్ ప్రొడక్ట్సే బెస్ట్ ..
ఆర్గానిక్ పద్ధతుల్లో పండినవి బెస్ట్ అని అంటారు. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు మాత్రమే కాదు ప్రతి పంట ఆర్గానిక్ పద్ధతుల్లో పండించవచ్చు. అయితే.. ఆర్గానిక్ వల్ల ఏం లాభం లేదనే వాళ్లూ ఉన్నారు. అలాగే.. ఆర్గానిక్ ఫుడ్ బెస్ట్ అని చెప్పేవాళ్లూ ఉన్నారు. అయితే.. వీళ్లలో ఆర్గానిక్ బెస్ట్ అని చెప్పేవాళ్ల సంఖ్యే ఎక్కువ. ఆర్గానిక్ పద్ధతిలో ధాన్యాన్ని నేచురల్‌గా పండిస్తారు. అంటే.. పెరుగుదల కోసం, చీడ, పీడలను కంట్రోల్ చేయడానికి ఎలాంటి కెమికల్స్ వాడరు.
సహజ ఉత్పత్తులు..
పశువుల పేడ, ప్రకృతి ప్రసాదించిన సహజ ఉత్పత్తులను మాత్రమే వాడతారు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. భూమిలో సారం పెరుగుతుంది. మన ముందు తరాలకు నాణ్యమైన వనరులను అందించినవాళ్లం అవుతాం. పైగా ఫెస్టిసైడ్స్ వాడడం వల్ల ఎంతోమంది రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే అలాంటి సమస్యలు ఉండవు.
ఆర్గానిక్ ఫార్మింగ్..
ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ఎంకరేజ్ చేయడం వల్ల రైతులను కాపాడు కున్నవాళ్లం అవుతాం. పైగా ఆర్గానిక్ పండ్లు, కూరగాయల్లో హాని చేసే కెమికల్స్ ఉండవు. ఇటీవల చాలామందికి ఆరోగ్యంపై అవగాహన పెరిగినా, మంచి ఆహార అలవాట్లను గురించి తెలుసుకున్నా, ఆర్గానిక్ ఫుడ్ మంచిదని తెలిసినా.. తినలేక పోతున్నారు.
రేటు ఎక్కువ..
ధరలు ఎక్కువగా ఉండడంతో ఆర్గానిక్ ఫుడ్ కొనలేకపోతున్నారు చాలామంది. ‘కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ తినడమంటే.. చాలా ఖర్చుతో కూడుకున్నదిగా భావిస్తున్నారు. డబ్బు ఉన్నవాళ్లు కొందరు ఆర్గానిక్‌కి మారినా.. డబ్బు లేనివాళ్లు కొన్ని ఆర్గానిక్ ఉత్పత్తులను మాత్రమే కొనగలుగుతున్నారు.
ఇది కూడా చదవండి.. అద్భుతమైన ప్రయోజనాలు..అందించే జ్యూస్ లు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com