సాక్షి లైఫ్ : అమెరికాలో ప్రతి సంవత్సరం తల, మెడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో దాదాపు 70శాతం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వల్ల సంభవిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, గర్భాశయ క్యాన్సర్లకు ఉన్నట్లుగా, ఈ క్యాన్సర్లను ముందే గుర్తించడానికి ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు లేవు. దీనివల్ల, రోగులకు సాధారణంగా లక్షణాలు కనిపించి, క్యాన్సర్ కణాలు బాగా పెరిగిన తర్వాతే వ్యాధి నిర్ధారణ అవుతుంది. దీనివల్ల చికిత్స సరైన సమయంలో అందించలేకపోతున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?