బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..! హార్వర్డ్ పరిశోధనలో షాకింగ్ నిజాలు.. 

సాక్షి లైఫ్ : "అల్పాహారం రాజులా చేయాలి", "మధ్యాహ్నం భోజనం యువరాజులా", "రాత్రికి పేదవాడిలా" ఆహారం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఆ బ్రేక్‌ఫాస్ట్ ఏ సమయంలో తింటున్నామనేది కూడా చాలా ముఖ్యమని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేసే అలవాటు ఉన్నవారికి మరణాల ముప్పు పెరుగు తుందని, ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

 

అధ్యయనంలో ..  

మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన పరిశోధకులు 42 నుంచి 94 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 3వేలమందిపై 22 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపారు. 

ఈ అధ్యయనంలో కనుగొన్న విషయాలు..  

మరణాల ముప్పు : అల్పాహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల ప్రతి గంటకు, మరణాల ముప్పు 8-11శాతంపెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

అనారోగ్య సమస్యలు..  

ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్ చేసేవారిలో అలసట, డిప్రెషన్, సరైన నిద్ర లేకపోవడం, ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ లక్షణాలు కొన్నిసార్లు గుర్తించని ఇతర ఆరోగ్య సమస్యలకు సూచనలు కావచ్చు.

క్రోనోన్యూట్రిషన్: మన శరీర అంతర్గత గడియారం (సర్కాడియన్ రిథమ్) ప్రకారం భోజనం చేయడం చాలా ముఖ్యం. ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల ఈ జీవ గడియారం దెబ్బతిని, జీవక్రియ మందగిస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : harmful-to-health new-study breakfast study low-carb-diet-leads-to-increased-mortality latest-research foods-to-eat-for-breakfast high-protein-breakfast what-should-i-eat-for-breakfast circadian-rhythm healthy-breakfast indian-breakfast late-breakfast-risk harvard-study health-and-longevity mortality-risk late-breakfast-side-effects
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com