ICMR Warning : నార్మల్ యాంటీబయాటిక్స్‌కు లొంగని 'సూపర్‌బగ్స్'.. ICMR హెచ్చరిక..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశంలో ప్రజారోగ్యానికి పెనుముప్పు పొంచి ఉంది! అత్యంత సాధారణంగా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI), న్యుమోనియా, సెప్సిస్ రక్తంలో ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులకు చికిత్స చేయడం రానురాను కష్టంగా మారుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజాగా విడుదల చేసిన నివేదిక తీవ్రంగా హెచ్చరించింది.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

సాధారణంగా రోగులకు వాడే కీలకమైన యాంటీబయాటిక్స్ (Antibiotics)కు ఇప్పుడు అనేక రకాల సూపర్‌బగ్స్ (Superbugs) నిరోధకతను (Resistance) పెంచుతున్నాయని 2024 సంవత్సరానికి సంబంధించిన 'యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ రీసెర్చ్ అండ్ సర్వైలెన్స్ నెట్‌వర్క్ (AMRSN)' నివేదికలో ICMR స్పష్టం చేసింది.

 ప్రధానంగా విఫలమవుతున్న యాంటీబయాటిక్స్‌ ఇవే..

ప్రముఖ ఆసుపత్రుల నుంచి సేకరించిన దాదాపు లక్ష ప్రయోగశాల-నిర్ధారిత ఇన్ఫెక్షన్ నమూనాలను విశ్లేషించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం, చికిత్సకు సాధారణంగా వాడే మందులు విఫలమవుతున్నాయి.క్వినోలోన్స్ (Fluoroquinolones): అతిసారం (Diarrhoeal illnesses) టైఫాయిడ్ (Salmonella Typhi) వంటి వ్యాధులకు ఇచ్చే ఈ మందులు 95శాతం పైగా కేసుల్లో విఫలమవుతున్నాయి. థర్డ్-జనరేషన్ సెఫాలోస్పోరిన్స్ (Third-generation cephalosporins): ఇవి కూడా అనేక ఇన్ఫెక్షన్లకు సరిగా పనిచేయడం లేదు.

కార్బపెనమ్స్ (Carbapenems).. వీటిని అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌గా పరిగణిస్తారు. ఐసీయూ (ICU)లలో వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు ఇవి కీలకం. అయితే, క్లెబ్సియెల్లా న్యుమోనియే (Klebsiella pneumoniae) వంటి బ్యాక్టీరియా ఈ మందులకు కూడా లొంగడం లేదు.

పైపెరాసిలిన్-టాజోబాక్టమ్ (Piperacillin-tazobactam)..న్యుమోనియాకు ప్రధాన కారణమైన క్లెబ్సియెల్లా బ్యాక్టీరియా దాదాపు 75శాతం కేసుల్లో ఈ డ్రగ్‌కు నిరోధకతను చూపింది.

 ఐసీయూలలో మరింత తీవ్రమైన పరిస్థితి..ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ICUs)లలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఎసినిటోబాక్టర్ బౌమన్నీ (Acinetobacter baumannii).. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యంత ప్రమాదకరమైన జాబితాలో చేర్చిన ఈ బ్యాక్టీరియా, శక్తివంతమైన మెరోపెనమ్ (Meropenem) అనే యాంటీబయాటిక్‌కు 91శాతం నిరోధకతను కలిగి ఉందని నివేదిక తెలిపింది.

రక్త ప్రసారం ఇన్ఫెక్షన్లు (Bloodstream Infections)..రక్తంలో సంభవించే తీవ్రమైన ఇన్ఫెక్షన్లలో 72శాతం వరకు మందులకు లొంగని గ్రామ్-నెగటివ్ (Gram-negative) బ్యాక్టీరియా వల్లే వస్తున్నాయని ICMR నివేదిక పేర్కొంది.

 తక్షణ చర్యలు తీసుకోకపోతే.. ICMR హెచ్చరిక.. 

సాధారణంగా వాడే యాంటీబయాటిక్స్ శక్తి కోల్పోతుండటం వల్ల, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు చికిత్స ఎంపికలు (Treatment Options) వేగంగా తగ్గిపోతున్నాయి. దీంతో వైద్యులు మరింత ప్రమాదకర మైన లేదా సంక్లిష్టమైన ఔషధాల కలయికను ఉపయోగించా ల్సి వస్తోంది.

ICMR సూచించిన తక్షణ చర్యలు ఏమిటి..? 

వివేకవంతమైన యాంటీబయాటిక్ వాడకం (Rational Antibiotic Use): అనవసరంగా లేదా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడకాన్ని కఠినంగా నియంత్రించాలి. ఆసుపత్రులు, కమ్యూనిటీలలో పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ నియంత్రణ ప్రమాణాలను బలోపేతం చేయాలి.
 సూపర్‌బగ్‌ల వ్యాప్తిని, నిరోధకత స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలి.

సులభంగా నయమయ్యే ఇన్ఫెక్షన్లకు కూడా శక్తివంతమైన యాంటీబయాటిక్స్ విఫలమవడం ప్రమాదకర సంకేతం. తక్షణమే యాంటీబయాటిక్ వాడకంపై కఠిన నియంత్రణలు, ఇన్ఫెక్షన్ నివారణ చర్యలు చేపట్టకపోతే, సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా చికిత్స అందించడం అసాధ్యంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.