న్యూ స్టడీ : నేరేడు గింజల పొడి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం..
సాక్షి లైఫ్ : మధుమేహంతో పాటు, నేరేడు గింజల పొడి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుందని డాక్టర్ పిళ్లై వెల్లడించారు. "మధుమేహం ఉన్నవారు రోజుకు ఒక టీస్పూన్ నేరేడు గింజల పొడిని, ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, దీనిని స్మూతీలు, మజ్జిగ, సలాడ్‌లు లేదా ఓట్స్‌లో కూడా కలుపుకోవచ్చు" అని ఆమె సూచించారు.
ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
బెంగళూరులోని ఆస్టర్ సీఎమ్‌ఐ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డా.పూజా పిళ్లై నేరేడు గింజల పొడి మధుమేహం ఉన్నవారికి అద్భుతమైన దివ్యౌషధమని పేర్కొన్నారు. "నేరేడు గింజల్లో జంబోలిన్, జంబోసిన్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను చక్కెరగా మార్చే ప్రక్రియను నెమ్మదింప చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో సహాయపడుతుంది" అని డా.పూజా పిళ్లై తెలిపారు.
అతిగా తీసుకోవడం వల్ల (హైపోగ్లైసీమియా) రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోవచ్చని, ముఖ్యంగా మధుమేహ మందులతో కలిపి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఇన్సులిన్ తీసుకునేవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని ఉపయోగించాలని డాక్టర్ పిళ్లై స్పష్టం చేశారు. "ఏ సహజ నివారణ అయినా, పరిమాణం కంటే స్థిరత్వం ముఖ్యమని గుర్తుంచుకోండి. కనుక, కల్తీ లేని, స్వచ్ఛమైన సేంద్రియ పొడిని ఎంచుకోండి" అని ఆమె చెప్పారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
