Relief for Migraine Sufferers : మైగ్రేన్‌ బాధితులకు ఊరట.. ఓరల్ మెడిసిన్స్ తో సత్ఫలితాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మైగ్రేన్‌తో బాధపడేవారికి వివిధ రకాల నోటి మాత్రలు (Oral Preventives) క్లినికల్ ప్రాక్టీస్‌లో ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే అంశంపై నార్వేలోని సెయింట్ ఓలవ్స్ యూనివర్సిటీ ఆసుపత్రి శాస్త్రవేత్తలు 'మిగ్రీనార్' (MigriNor) పేరుతో ఒక కీలక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

అధ్యయనం జరిగిందిలా..

మొత్తం 254 మంది మైగ్రేన్ బాధితులపై ఈ పరిశోధన సాగింది. వీరికి సాధారణంగా వాడే కాండెసార్టన్ (Candesartan), అమిట్రిప్టిలైన్ (Amitriptyline), మెటోప్రోలోల్ (Metoprolol), టోపిరామేట్ (Topiramate) అనే నాలుగు రకాల మందులను ఇచ్చి 12 వారాల పాటు వారి ఆరోగ్య స్థితిగతులను గమనించారు.

ప్రధాన అంశాలు..

మెరుగైన ఫలితాలు: కాండెసార్టన్, అమిట్రిప్టిలైన్ మాత్రలు వాడిన వారిలో తలనొప్పి తీవ్రత గణనీయంగా తగ్గింది. నెలకు సగటున 2.4 రోజుల పాటు తీవ్రమైన తలనొప్పి నుంచి వీరికి ఉపశమనం లభించింది.

దుష్ప్రభావాలు..?

 చికిత్సలో భాగంగా మందుల దుష్ప్రభావాల (Side Effects) వల్ల 22శాతం నుంచి 46శాతం మంది రోగులు మధ్యలోనే మందులు వాడటం మానేశారు.

ఏది సురక్షితం..? 

 కాండెసార్టన్ మాత్రలు వాడిన వారిలో తక్కువ దుష్ప్రభావాలు కనిపించగా, అత్యధికంగా టోపిరామేట్ వాడిన వారిలో 95.7% మంది ఏదో ఒక రకమైన అసౌకర్యానికి గురైనట్లు తేలింది. మైగ్రేన్ నివారణలో మందుల ప్రభావం ఎంత ఉన్నప్పటికీ, రోగి శరీరం ఆ మందును ఎంతవరకు తట్టుకోగలదు (Tolerability) అనేదే చికిత్సలో కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా కాండెసార్టన్, అమిట్రిప్టిలైన్ వంటివి మైగ్రేన్ భారాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అయితే, వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందులను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.