మహిళల్లో పురుషుల కంటే ఐదేళ్లు ముందుగానే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం..!
సాక్షి లైఫ్ : ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధానంగా పురుషులే ఎక్కువగా గురవుతారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అందుకు సిగరెట్లు, బీడీలు తాగడం వంటి అలవాట్లే దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తారు. అయితే తాజాగా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధనలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాయి. మహిళలు పురుషుల కంటే ఐదేళ్లు ముందుగానే ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారాలు మానేయాలి..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం..
పురుషులు సాధారణంగా 50-74 సంవత్సరాల మధ్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతుండగా, మహిళలు 45-69 సంవత్సరాల వయస్సులోనే ఈ వ్యాధికి గురవుతున్నారు. అంటే పురుషుల కంటే ఐదేళ్లు ముందుగానే మహిళలు క్యాన్సర్ ప్రమాదానికి గురువుతున్నారు. వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, చాలా తక్కువ మంది రోగులు మాత్రమే శస్త్రచికిత్స చేయించుకోగలుగుతున్నారు.
ప్రారంభ దశలో ఉన్న పురుషులలో 5.9 శాతం మంది, మహిళలలో 8.4 శాతం మంది మాత్రమే శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. చాలా మంది రోగులకు కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా మాత్రమే చికిత్స చేస్తున్నారు. ముదిరిన దశలో ఉన్న 77.7 శాతం మంది రోగులకు నొప్పిని తగ్గించడానికి మాత్రమే ఉపశమన చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
