భారత్‌లో మహిళల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువ, పురుషుల్లో మరణాల రేటు అధికం: ఐసీఎంఆర్ స్టడీ 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారత్‌లో క్యాన్సర్ కేసులు, మరణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంచలన విషయాలు వెల్లడించింది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 43 క్యాన్సర్ రిజిస్ట్రీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, మొత్తం ఏడు లక్షల, ఎనిమిది వేల ,రెండువందల ఇరవై మూడు క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రెండు లక్షల ,ఆరు వేల ,నాలుగు వందలయాభై ఏడు మంది మరణించారు.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

"జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ " (జెఏఎమ్ఏ) జర్నల్‌లో ప్రచురితమైన " క్యాన్సర్ ఇన్సిడెన్స్ అండ్ మోర్టలిటీ అక్రాస్ 43 సెంటర్ రిజిస్ట్రీస్ ఇన్ ఇండియా " అనే ఈ అధ్యయనం ప్రకారం, నమోదైన క్యాన్సర్ కేసుల్లో 50శాతం పైగా మహిళల్లో ఉండగా, పురుషుల్లో 49శాతంగా ఉన్నాయి. అయితే, మరణాల రేటు పురుషుల్లో (55శాతం) ఎక్కువగా ఉన్నట్లు, మహిళల్లో (45శాతం) తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.


మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్‌లలో రొమ్ము క్యాన్సర్ (2,38,085 కేసులు), గర్భాశయ క్యాన్సర్ (78,499 కేసులు),  అండాశయ క్యాన్సర్ (48,984 కేసులు) ఉన్నాయి. పురుషుల్లో నోటి క్యాన్సర్ (1,13,249 కేసులు), ఊపిరితిత్తుల క్యాన్సర్ (74,763 కేసులు), ప్రొస్టేట్ క్యాన్సర్ (49,998 కేసులు).

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.