విటమిన్ "ఇ" అనేది ఎలా ఉపయోగపడుతుంది..?
సాక్షి లైఫ్ : మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఎప్పుడూ తినే ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని పోషకాలు చర్మం, జుట్టుకు కూడా అవసరం. వీటిలో విటమిన్ "ఇ" ఒక ముఖ్యమైన విటమిన్ గా చెప్పవచ్చు. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి, జుట్టును సంరక్షించడానికి, అలాగే కంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది.
విటమిన్ "ఇ" ని మన ఆహారంలో చేర్చడం వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మసౌందర్యాన్ని పెంచుతుంది: విటమిన్ "ఇ" చర్మంలోని మృత కణాలను రీజెనరేట్ చేయడంలో సహాయపడుతుంది, తద్వారా చర్మం మృదువుగా ఉంటుంది.
చర్మానికి విటమిన్ "ఇ" వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..
ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?
ఇది కూడా చదవండి..హైబీపీని నియంత్రించే పొటాషియం రిచ్ ఫుడ్స్..
ఫ్రీ రాడికల్స్ ను నివారించడంలో..
విటమిన్ "ఇ" అనేది యాంటీఆక్సిడెంట్లకు మూలం. ఇది అతి నీలిలోహిత కిరణాల వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. అంతేకాదు సన్‌బర్న్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. విటమిన్ "ఇ" సన్‌బర్న్ వల్ల కలిగే దురద నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
పొడి చర్మాన్ని..
విటమిన్ "ఇ" ఎల్లో నెయిల్ సిండ్రోమ్‌ను నివారిస్తుంది. అంతేకాదు పొడి చర్మాన్ని, పొరలుగా ఉండే చర్మాన్ని నిరోధించడానికి లేదా చికిత్స చేయడానికి సహాయపడుతుంది. దీనిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. విటమిన్ "ఇ"ని అనేక మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లలో కూడా ఉపయోగిస్తారు.
కణాల పునరుత్పత్తి..
విటమిన్ "ఇ" కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. గోధుమ రంగు మచ్చలను తొలగిస్తుంది. రెగ్యులర్‌గా అప్లై చేస్తే స్ట్రెచ్ మార్క్స్‌ని తగ్గించుకోవచ్చు. విటమిన్ "ఇ"లో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలోనూ, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మంపై ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాలను నియంత్రిస్తాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
