How to Detect Breast Cancer Early : బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందస్తుగా ఎలా గుర్తించాలి..?

సాక్షి లైఫ్ : ఈమధ్యకాలంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకు కారణాలు ఎన్ని ఉన్నా.. ఒకవేళ ప్రారంభ దశలో గుర్తిస్తే ఆ మహమ్మారిని నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతి నెలా మహిళలు తమకు తాముగా కొన్నిమార్పులను గమనించాలి.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

 

మరి ముందస్తుగా  బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలి..?

ప్రతి నెలా మహిళలు తమకు తాముగా కొన్నిమార్పులను గమనించాలి.

ముఖ్యంగా రొమ్ములో లేదా చంక భాగంలో చిన్న గడ్డలాంటిది తగిలినప్పుడు అవసరమైన వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
ఒకవేళ రొమ్ము పరిమాణం లేదా ఆకృతిలో హఠాత్తుగా మార్పు వచ్చినా వెంటనే ఆంకాలజిస్ట్ ను సంప్రదించాలి.

చర్మంపై ఎర్రటి మచ్చలు లేదా నారింజ తొక్కలాగా గుంతలు పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యుల దగ్గరకు వెళ్లాలి. చనుమొనల నుంచి అసాధారణ ద్రవాలు వచ్చినా డాక్టర్ ను సంప్రదించాలి.

క్యాన్సర్ నివారణ మార్గాలు (Prevention Tips).. 

బరువు నియంత్రణ.. ఊబకాయం వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగి క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా అలవాటు చేసుకోవాలి. శిశువుకు కనీసం ఏడాది పాటు తల్లి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు.. 

మామోగ్రామ్ (Mammogram): 40 ఏళ్లు దాటిన మహిళలు ఏటా ఒకసారి ఈ ఎక్స్-రే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, ముందే వైద్యులను సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవాలి.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : cancer-types breast-cancer cancer-treatment cancer-cases breast-milk breastfeeding cancer-risk worldwide breast-cancer-treatment mammogram breast-cancer-screening breast-health world-cancer-day-2026
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com