Nutritional Deficiency in Girls: ఆడపిల్లల్లో పోషకాహార లోపాన్ని ఎలా అధిగమించాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బాలికల ఆరోగ్యం కేవలం వ్యాధి నివారణ మాత్రమే కాదు.. అది శారీరక, మానసిక, భావోద్వేగ సమతుల్యత. నేటి బాలికలే రేపటి తల్లులు. వారి పునాది బలంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలలో పోషకాహార లోపాన్ని అరికట్టాలంటే ముందుగా తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఆ తర్వాత తల్లులు తీసుకునే పోషకాహారమే వారి పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా బాలికల విషయంలో మనం చూపే చిన్నపాటి నిర్లక్ష్యం వారి జీవితకాలంపై ప్రభావం చూపుతుంది.

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 

రక్తహీనత.. 

భారతీయ బాలికలలో అత్యంత ప్రధాన సమస్య రక్తహీనత (Anemia). రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల అలసట, బలహీనత ఏర్పడతాయి. ఇది కేవలం శారీరక పెరుగుదలనే కాకుండా, జ్ఞాపకశక్తిని, మానసిక వికాసాన్ని కూడా దెబ్బతీస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే12 ఏళ్ల వయస్సులో హిమోగ్లోబిన్ కనీసం 12 mg/dL ఉండాలి. 10 నుంచి 19 ఏళ్ల వయస్సు గల కిశోర బాలికలు వారానికి ఒకసారి ఐరన్ (60mg), ఫోలిక్ యాసిడ్ (500mcg) టాబ్లెట్ తీసుకోవడం ఉత్తమం.

గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. HPV వ్యాక్సిన్..!

నేటి కాలంలో మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్య గర్భాశయ క్యాన్సర్. దీనిని రాకుండా నివారించగలిగే అద్భుతమైన మార్గం HPV వ్యాక్సిన్.
9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

మారుతున్న జీవనశైలి.. కొత్త సవాళ్లు.. 

సాంకేతికత పెరిగేకొద్దీ చిన్న వయస్సులోనే ఊబకాయం (Obesity), అధిక స్క్రీన్ సమయం, తోటివారి ఒత్తిడి (Peer Pressure) కారణంగా ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నాయి. బాలికలకు ఇనుము, కాల్షియం అధికంగా ఉండే పోషకాహారాన్ని అందించాలి.

 థైరాయిడ్, రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యత దరిచేరకుండా ఉండాలంటే రోజూ శారీరక శ్రమ తప్పనిసరి. ఆందోళన, మానసిక ఒత్తిడిని బాలికలు గుర్తించేలా చేయాలి. యోగా, ధ్యానం వంటి వాటిని వారి దినచర్యలో భాగం చేయాలి.

తల్లిదండ్రుల బాధ్యత.. 

తమ ఆరోగ్యం కంటే ఇంటి పనులే ముఖ్యమని భావించే ధోరణిని బాలికల్లో పెరగనివ్వకూడదు.  తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం కాదు.. అది ఒక అవసరం అని వారికి చిన్నతనం నుంచే నేర్పించాలి. సరైన పోషకాహారం, సకాలంలో వ్యాక్సినేషన్, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఆడపిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.