Cancer in Pregnant Women : గర్భిణుల్లో క్యాన్సర్ ను ముందుగా గుర్తించేందుకు కొత్త గైడ్‌లైన్స్..
సాక్షి లైఫ్ : ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా.. క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ప్రతి వెయ్యి నుంచి రెండు వేల గర్భధారణల్లో ఒకరికి క్యాన్సర్ నిర్ధారణ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది అరుదైన విషయమే అయినప్పటికీ, వైద్యపరంగా, మానసికపరంగా ఇది ఎంతో సున్నితమైన అంశం. ఈ నేపథ్యంలో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ'లో ప్రచురితమైన ఈ కొత్త గైడ్‌లైన్స్ పలు కీలక సూచనలు చేశాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
చికిత్స అందించే సమయంలో..
క్యాన్సర్ చికిత్స అందించే సమయంలో తల్లి కోరికలు, అవసరాలతో పాటు గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. క్యాన్సర్ ఏ స్థాయిలో ఉంది? చికిత్స వల్ల బిడ్డపై పడే ప్రభావం ఎంత? వంటి అంశాలను బేరీజు వేస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు.
ముఖ్యమైన మార్గదర్శకాలు ఏంటి అంటే..?
గర్భిణికి చికిత్స అందించేటప్పుడు కేవలం ఆంకాలజిస్ట్ మాత్రమే కాకుండా.. గైనకాలజిస్టులు, ఫార్మసిస్టులు, మానసిక నిపుణులతో కూడిన బృందం పర్యవేక్షణలో చికిత్స జరగాలి. చికిత్స ప్రారంభించే ముందే అందులోని రిస్కులు, ప్రయోజనాల గురించి రోగికి, వారి కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయిలో వివరించి, వారి అంగీకారం తీసుకోవాలి.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తల్లి ప్రాణాలను రక్షించేందుకు తక్షణ చికిత్స అవసరమవుతుంది. అటువంటి సందర్భాల్లో అనివార్యమైతే గర్భ విచ్ఛిన్నం (Termination) కూడా చేయాల్సి రావచ్చు. కొత్త రకం మందులు (Antibody-drug conjugates వంటివి) బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై ఇంకా పూర్తిస్థాయి ఆధారాలు లేవు. అందుకే వీలైనంత వరకు ప్రసవం తర్వాతే వీటిని వాడాలని లేదా తక్కువ ప్రభావం చూపే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఆలస్యం చేయడం వల్ల..
చికిత్స ఆలస్యం చేయడం వల్ల కలిగే నష్టాన్ని, అలాగే చికిత్స వల్ల బిడ్డకు కలిగే ముప్పును నిశితంగా పరిశీలించాలి. ప్రతి రోగి పరిస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి, వారి ప్రాధాన్యతలను బట్టి చికిత్సను రూపొందించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు భయం వద్దు.. సరైన వైద్య పర్యవేక్షణ, కుటుంబ సభ్యుల తోడ్పాటుతో తల్లి, బిడ్డ ఇద్దరినీ క్షేమంగా కాపాడుకునే అవకాశాలు మెరుగయ్యాయని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
