ప్రీ-మెనోపాజ్‌ని ఎదుర్కోవటానికి పరిష్కార మార్గాలు..
సాక్షి లైఫ్ : మహిళలు తమ ఆహారంలో పోషకాహారాన్ని చేర్చుకోవడం ద్వారా శారీరకంగా,మానసికంగా హెల్తీగా ఉండవచ్చు. మహిళలు ముఖ్యంగా క్యాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ముప్పు పెరుగుతుంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
వ్యాయామం..
మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. మెనోపాజ్ కారణంగా బరువు కూడా వేగంగా పెరుగుతారు. వ్యాయామం చేస్తే బరువును నియంత్రించవచ్చు.
వేడిని పెంచే ఆహారానికి దూరంగా ఉండండి..
కెఫిన్, ఆల్కహాల్ , స్పైసీ ఫుడ్ తీసుకోవడం మానుకోండి. వీటిని తీసుకోవడం వల్ల మెనోపాజ్ సమయంలో అధికంగా వేడి చేస్తుంది. ఎందుకంటే ఈ ఆహారాలు మెనోపాజ్ సమయంలో సంభవించే 'హీట్ ఫ్లాషెస్'ని ప్రోత్సహిస్తాయి.
పుష్కలంగా నీరు తాగాలి..
మెనోపాజ్ కారణంగా మహిళలల్లో చర్మం, జుట్టు, గోర్లు పొడిగా మారుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రీ-మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
