ప్రతి గర్భిణీ స్త్రీ తెలుసుకోవలసిన వేసవికాలం జాగ్రత్తలు
సాక్షి లైఫ్ : ఉష్ణోగ్రతలు దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దీని కారణంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గర్భిణీల ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు వారి ఆరోగ్యంపైనే కాకుండా కడుపులోని బిడ్డపై కూడా ప్రభావం చూపవచ్చు. కాబట్టి, వేసవి కాలంలో గర్భిణీలు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
లేత రంగు దుస్తులు: నలుపు వంటి ముదురు రంగులు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. కాబట్టి, తెలుపు లేదా లేత రంగుల్లో ఉండే వదులైన, కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఇవి శరీరం చల్లగా ఉండటానికి సహాయపడతాయి.
తరచుగా చల్లటి నీటితో స్నానం: రోజుకు రెండుసార్లు చల్లటి నీటితో స్నానం చేయడం లేదా శరీరాన్ని తడి గుడ్డతో తుడుచుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొంతమేర తగ్గుతుంది.
ఎక్కువ వేడి లేకుండా : వంట చేయడం లేదా ఇతర శారీరక శ్రమతో కూడిన పనులు ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు చేసుకోవడం మంచిది. మధ్యాహ్నం వేళల్లో విశ్రాంతి తీసుకోవాలి.
ఇంట్లో చల్లని ప్రదేశంలో ఉండటం ఉత్తమం : వీలైతే ఎయిర్ కండిషన్డ్ గదుల్లో లేదా బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించండి. కిటికీలు తెరిచి ఉంచడం, ఫ్యాన్లు వేసుకోవడం కూడా ఉపశమనం కలిగిస్తుంది.
తగినంత ద్రవపదార్థాలు..
నీళ్లు : రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి. దాహం వేసినా వేయకపోయినా నీరు తాగడం చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటిశాతం తగ్గి డి హైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు.
కొబ్బరి నీళ్లు, నిమ్మరసం : ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి. ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు తీసుకోవడం మంచిది, కానీ వాటిలో చక్కెర శాతం తక్కువగా ఉండేలా చూసుకోండి.
కెఫీన్- ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం : టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలు శరీరం నుంచి ఎక్కువ నీటిని బయటకు పంపిస్తాయి, దీనివల్ల డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది.
ఆహారం విషయంలో..
తేలికపాటి ఆహారం : సులభంగా జీర్ణమయ్యే, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వేయించిన, మసాలా దినుసులు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు : పుచ్చకాయ, దోసకాయ, కీర వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది.
సూర్యరశ్మి నుంచి రక్షణ : బయటికి వెళ్లాల్సి వస్తే, టోపీ లేదా గొడుగు ఉపయోగించండి. సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటికి వెళ్లకపోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
