ప్రీ-ఎక్లాంప్సియాతో తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచ ప్రీ-క్లాంప్సియా దినోత్సవం (మే 22) సందర్భంగా, గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య ప్రీ-క్లాంప్సియాపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. అధిక రక్తపోటుతో కూడిన ఈ రుగ్మత తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది.

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

 

ప్రీ-క్లాంప్సియా అంటే ఏమిటి..?

గర్భధారణలో 20వ వారం తర్వాత గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటుతో పాటు మూత్రంలో ప్రోటీన్ కనిపించడం, కిడ్నీలు, లివర్, మెదడు వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపడాన్ని ప్రీ-క్లాంప్సియా అంటారు. ఇది నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు.

ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..?  

తీవ్రమైన తలనొప్పి
దృష్టిలో మార్పులు..  
మోకాళ్ళు, ముఖం, చేతులలో వాపు
వేగంగా బరువు పెరగడం
ఉదర భాగంలో నొప్పి
వాంతులు లేదా వికారం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఈ లక్షణాలు ఏవి కనిపించినా, వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

 

ఇది కూడా చదవండి..రక్త కణాల ఉత్పత్తిలో కాపర్ పాత్ర..?

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.