ప్రీ-మెనోపాజ్‌కు సరైన పరిష్కార మార్గాలు..
సాక్షి లైఫ్ : మహిళల జీవితంలో మెనోపాజ్ ఒక సహజమైన దశ అయినప్పటికీ, ఈ సమయంలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మెనోపాజ్‌కు ముందు, ఆ తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, నిద్ర, వ్యాయామం వంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మహిళలు మెనోపాజ్ సమయంలో అనుసరించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే ప్రాణాలకు ఎందుకు ప్రమాదం..?
ఇది కూడా చదవండి..గట్ హెల్త్ ను కాపాడడంలో ఏమేం అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి..?
ఇది కూడా చదవండి..Kids health : పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు ప్రాణాంతకం..?
స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలి..
కెఫిన్, ఆల్కహాల్ , స్పైసీ ఫుడ్ తీసుకోవడం మానుకోండి. వీటిని తీసుకోవడం వల్ల మెనోపాజ్ సమయంలో అధికంగా వేడి చేస్తుంది. ఎందుకంటే ఈ ఆహారాలు మెనోపాజ్ సమయంలో సంభవించే 'హీట్ ఫ్లాషెస్'ని ప్రోత్సహిస్తాయి.
పుష్కలంగా నీరు తాగాలి..
మెనోపాజ్ కారణంగా మహిళలల్లో చర్మం, జుట్టు, గోర్లు పొడిగా మారుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రీ-మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం..
మహిళలు తమ ఆహారంలో పోషకాహారాన్ని చేర్చుకోవడం ద్వారా శారీరకంగా,మానసికంగా హెల్తీగా ఉండవచ్చు. మహిళలు ముఖ్యంగా క్యాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ముప్పు పెరుగుతుంది. కాబట్టి పోషకాహారం తగినంతగా తీసుకోవాలి.
వ్యాయామం..
మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. మెనోపాజ్ కారణంగా బరువు కూడా వేగంగా పెరుగుతారు. వ్యాయామం చేస్తే బరువును నియంత్రించవచ్చు.
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?
ఇది కూడా చదవండి.. ఏలకులలో ఎన్ని అద్భుత ఔషధగుణాలున్నాయో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
