Urinary Tract Infection Risk : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎవరికి ఎక్కువ..? పురుషులకా..? మహిళలకా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల ఈ మధ్యకాలంలో యువతను వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ‘యూటీఐ’ (Urinary Tract Infection) మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ఒకటి. సాధారణంగా ఈ సమస్య అనగానే చాలామంది ఇది కేవలం మహిళలకు మాత్రమే వస్తుందని భావిస్తుంటారు. అయితే, పురుషులు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ..? అసలు దీనికి గల కారణాలు, లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం...

ఇది కూడా చదవండి..Gen Z Trend ‘Panic Pouch’ : జెన్ జెడ్ ట్రెండ్ ‘పానిక్ పౌచ్’.. యాంగ్జైటీ, ఒత్తిడికి చెక్ పెట్టే మినీ కిట్..!

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

వైద్య నివేదికల ప్రకారం.. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. దీనికి ప్రధాన కారణం వారి శరీర నిర్మాణమే.

మహిళల్లో కారణాలు..

మహిళల్లో మూత్రనాళం (Urethra) పొడవు తక్కువగా ఉంటుంది. దీనివల్ల బాక్టీరియా చాలా సులభంగా, వేగంగా మూత్రాశయంలోకి ప్రవేశిస్తుంది. దీనికి తోడు మెనోపాజ్ (రుతువిరతి) తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం కూడా ఈ ఇన్ఫెక్షన్ల ముప్పును పెంచుతుంది.

పురుషుల్లో కారణాలు..

పురుషులలో సాధారణంగా వయసు పైబడిన వారిలో, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు ఉన్నవారిలో లేదా మూత్రం సజావుగా బయటకు వెళ్లనప్పుడు మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి అంటే..?

చాలామంది యూటీఐ ప్రారంభ లక్షణాలను సాధారణ అలసటగా లేదా వేడిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. అవేంటంటే..?

తరచుగా, అత్యవసరంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం.

మూత్రం విసర్జించే సమయంలో తీవ్రమైన మంట, నొప్పి లేదా పొత్తికడుపులో అసౌకర్యం.

మూత్రం పూర్తిగా ఖాళీ కాలేదనే భావన కలగడం.

మూత్రం ముదురు రంగులోకి (ఎరుపు, గులాబీ లేదా కోలా రంగు) మారడం లేదా తీవ్రమైన దుర్వాసన రావడం.

ఇన్ఫెక్షన్ తీవ్రమైతే అది కిడ్నీల వరకు పాకి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.

ముప్పును పెంచే ఇతర కారణాలు ఏమిటంటే..?

లైంగిక పరిశుభ్రత: సంభోగం సమయంలో భాగస్వామి ద్వారా లేదా సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల బాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ ఇన్ఫెక్షన్లు తరచుగా దాడి చేస్తాయి. పబ్లిక్ టాయిలెట్స్..పరిశుభ్రంగా లేని బహిరంగ మరుగుదొడ్లను ఉపయోగించడం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువ.

నివారణ మార్గాలు ఏమిటంటే..? 

చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు లేదా ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా బాక్టీరియా బయటకు కొట్టుకు పోతుంది. జననాంగాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కలయిక తర్వాత మూత్రవిసర్జన చేయడం వల్ల బాక్టీరియా చేరకుండా చూసుకోవచ్చు. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల బాక్టీరియా వృద్ధి చెందే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఆ అలవాటును వెంటనే మానుకోవాలి.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.