ఊపిరితిత్తులను రక్షించే పండ్లు.. తాజా అధ్యయనంలో వెల్లడి..  

సాక్షి లైఫ్ : ఊపిరిత్తులు శరీరంలో ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.  శరీరంలో ఇవి ముఖ్యమైన అవయవాలు. ఇవి శ్వాసక్రియ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఊపిరిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఊపిరిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొన్నిరకాల పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండు రకాల పండ్లకు ఊపిరితిత్తులను రక్షించే శక్తి ఉంది. అవేంటంటే..? 

 

ఇది కూడా చదవండి.నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి.ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

 ఊపిరితిత్తులకు సంబంధించిన  రుగ్మతలు..  

టమాటాలు-యాపిల్స్ ఊపిరితిత్తులను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తాజా అధ్యయనం కనుగొంది. యాపిల్స్, టమాటాలు తిన్నవారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన  రుగ్మతలను పరిష్కరిస్తాయని అధ్యయనం ద్వారా పరిశోధకులు గుర్తించారు. రోజుకు రెండు టమాటాలు లేదా మూడు ఆపిల్ పండ్లను తిన్న వారితో పోలిస్తే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడిందని అధ్యయనం కనుగొంది. టమాటాలను ఎక్కువగా తినేవారికి ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణంగా 35 ఏళ్ల తర్వాత, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ఆపిల్ , టమాటా పండ్లను ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడమే దీనికి చక్కటి పరిష్కారమని అధ్యయనం సూచిస్తుంది. ఇది ధూమపానం వల్ల కలిగే సమస్యలను కూడా ఎదుర్కోగలదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి...వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : lungs-diseases new-study research apple lungs-health lung-problems latest-research tomatoes apples tomato-health-benefits health-benefits-of-tomato apples-health-benefits health-benefits-of-apple
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com