మైక్రోప్లాస్టిక్స్ కణాల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..?
సాక్షి లైఫ్ : నేటి జీవనశైలి మార్పుల కారణంగా అనేక వస్తువులు మన జీవన విధానంలో భాగమయ్యాయి. అటువంటివాటిలో ప్లాస్టిక్ ఉత్పత్తులను గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వీటి వినియోగం మరింతగా పెరగడంవల్ల తీవ్రమైన వ్యాధుల బారీన పడాల్సివస్తుంది. తాజాగా చేసిన అధ్యయనంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అండాశయాల్లో తొలిసారిగా మైక్రోప్లాస్టిక్స్ కణాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు, దీని కారణంగా మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడమే కాకుండా సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
అండాశయ కణజాలంలో మైక్రో ప్లాస్టిక్ కణాలను గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పరిశోధన చేశారు.ఇందులో భాగంగా 10 మంది మహిళల అండాశయ కణజాల నమూనాలను పరిశీలించారు, కానీ దాదాపు అన్ని నమూనాల్లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు వెల్లడైంది. పాలిథిలిన్, పాలీప్రొపైలిన్ వంటి ప్లాస్టిక్ రకాలు ఈ కణాల్లో ఎక్కువగా కనిపించాయి, ఇవి సాధారణంగా ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు, ఆహార ప్యాకేజింగ్‌లో ఉపయోగిస్తారు. ఈ కణాలు అండాశయంలో చేరడం వల్ల సంతాన సమస్యలు, అకాల మెనోపాజ్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
మహిళల ఆరోగ్యంపై మైక్రోప్లాస్టిక్స్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మైక్రోప్లాస్టిక్స్ ఖచ్చితంగా ఏ స్థాయిలో హాని కలిగిస్తాయో తెలుసుకోవడానికి విస్తృత అధ్యయనాలు చేయాల్సి ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లు..
ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు..
ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
